My Blog List

My Blog List

Tuesday, December 3, 2013

పతంజలి యోగసూత్రాలు : నాలుగవ అధ్యాయం

ఓం నమో పరమాత్మయే నమః
కైవల్య పాదం :
(మూడవ పాదం విభూది పాదం. ఇది తెలుసుకుంటే మంచిదే కానీ, వాటిని అనుకరిస్తే మనషి మరల అధోపాతానికి పోయే అవకాశాలు వున్నాయి. అందువలన అది మన లక్ష్యానిని దూరం చేయవచ్చును. అందువలన అది ఇక్కడ వివరింపబడలేదు).
కొందరు జన్మతః అంటే, పుట్టుకతోనే సిద్దపురుషులై వుంటారు. ఆ సిద్దులు వారు పూర్వజన్మలో వారి సాధన ఫలితాలు. నైతిక, మానసిక మరియు ఆద్యాత్మిక విషయాల్లో ఎదైనాసరే సమాధి వలన ప్రాప్తిస్తుంది.
మరొక జాతిగా పరిణమించుట అన్నది ప్రకృతి పరణామ సమప్తివల్ల కలుగుతుంది. జాతిలో మార్పుకల్గుట ప్రకృతి వలన కల్గును. ప్రకృతియే మార్పు చెంది, ఇన్ని రూపములను కన్పించుచుండెను. ఆకాశము నుండి వాయువు పుట్టుట మార్పు ఖనిజములు, వ్రుక్షత్వము, జంతుత్వము, నరత్వము చెందుట కూడా అట్టిదే.
సత్కర్మలు, దుష్కర్మలు స్వయంగా ప్రకృతి మార్పులకు కారణాలు కాజాలవు. అయితే అవి ప్రకృతి మార్పుల ఆటంకాలను తొలగిస్తాయి. మనిషిలో సర్వ శక్తులు వున్నాయి. పరిపూర్ణత మనిషి స్వభావం. ఇది సహజంగా వ్యక్తం కాకుండా మనమే బంధించి ఉంచాము. ఈ బంధనాలను తొలగిస్తే చాలు. ప్రక్రుతిశక్తులు మనలోకి ప్రవేసిస్తాయి.ప్రకృతి ప్రేరణ వలెననే మనం మోక్షమార్గంలో చర్చిస్తున్నాం.సహజమైన, జన్మ స్వతంత్రయమై వున్న కైవల్యాన్ని పొందటానికి గల అడ్డంకులను తొలగించటానికే మన ఈ సాధనాలన్నీ.
యోగి నిర్మించిన చిత్తాలు అస్మిత(అహంకారం) వలననే కలుగుతాయి. ఆత్మ స్వయంగా ఎన్నడు వికారం పొందదు. మనిషి ఏ విధమైన కర్మ చేసిన సహజ ఆత్మ ప్రభావాన్ని ఎన్నడు నష్టం చేయలేవు. అవిద్యావరణం ఆత్మ పరిపూర్ణతను మరుగు పరుస్తుందే కానీ ఆత్మకు వికారం కల్గించలేదు. దుష్కర్మలు ఆత్మ స్వభావాన్ని వ్యక్తం కాకుండా చేస్తే, సత్కర్మలు ఈ ప్రతిబందకాన్ని తొలగిస్తాయి.
యోగి కాగానే ఆ జ్ఞానం తిరిగి స్పురిస్తుంది. మనసు ఒక వస్తువు, ప్రకృతి మరొక వస్తువు కాదు. అవి రెండు భిన్నస్తితులు అని తెలుసుకుంటాడు.
వివిధ చిత్తాలన్నిటిలో సమాధి నిర్మిత చిత్తం కర్మవాసనారహితమైనది. సమస్త చిత్తాల్లో సమాధిస్తితి పొందిన చిత్తం అత్యుత్తమం. యోగంతో సమాధిస్తితి పొందిన వ్యక్తీ సంపూర్ణంగా వాంచారహితుడవుతాడు.           
యోగులు కాని వారికీ కర్మలు, తెలుపు, నలుపు మిశ్రమం అని మూడు రకాలుగా ఉంటాయి. యోగి సంపూర్ణుడైతే, అతను చేసే కర్మలు, వాటి ఫలాలు అతన్ని బంధించలేవు. ఎందువలన అంటే, అతను కర్మలను కోరిచేయడు. ఫలవా0చరహితంగా అతడు తన కర్మలను లోకకల్యాణం కోసం చేస్తుండటం వలన అవి అతనిని అంటవు.
చిత్తానికి అధిపతి అయిన పురుషునికి పరిణామం లేనందువలన, చిత్తవ్రుత్తులు నిరంతరం తెలుస్తున్నాయి. చలింపని వస్తువు ఒకటి వుంటే తప్ప చలించే వస్తువు యొక్క చలనాన్ని కనుక్కోలేము. నిర్వికార, నిర్మల, నిత్య,శుద్ధ పురుషుడు ఎన్నటికి మార్పు చెందకుండా స్తిరంగా ఉన్నాడు. మనః ప్రక్రుతులు రెండు మరిపోతువుంటాయి. కాబట్టి మనసుకన్న తక్కువ వేగం ఉన్నదోకటి, దానికంటే, ఇంకా తక్కువ వేగం వున్నదొకటి, పోను,పోను ఎన్నటికి మర్పుచేందని నిత్య శుద్ధ పురుషుని కనుగొని ఈ పరంపరని సమాప్తి చేయాలి.
ఆ చిత్తం పురుషునికి దృశ్య విషయమై వుండటం వలన స్వయం ప్రకాశకం కాదు.ప్రకృతిలో అంతటా అద్భుతశక్తి వ్యక్తమవుతున్నా, ఆ శక్తి స్వయం ప్రకాశకం కాదు.కానీ అదియే (పురుషుడు) స్వయం ప్రకాశకుడై, సమస్త ప్రకృతిని భాసింప చేయుచున్నాడు.
జ్ఞాన స్వరూపం (పురుషుడు) నిర్వికారమై ఉండటం వలన,చిత్తం పురుషుని స్వరూపాన్ని పొందినపుడు జ్ఞానవంత మవుతుంది. జ్ఞానం అనేది పురుషుని గుణం కాదు. చిత్తం పురుషుని సాన్నిద్యం పొందగానే పురుషుడు చిత్తం మీద ప్రతిఫలిస్తాడు. అందువలన చిత్తం తత్కలితంగా జ్ఞానవంతమై , తానె పురుషుడి వున్నట్లు కనిపిస్తుంది. 
వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తం పుర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతుంది. యోగాభ్యాసం చేయటం వలన నిర్మలమైన ద్రుష్టి అనబడే వివేకం కలుగుతుంది. అలా వివేకం కలిగినపుడు మన కండ్లకు కప్పిన మాయ కరిగిపోతుంది. అప్పుడు వస్తుతత్వం వివరంగా అర్థం అవుతుంది. ప్రకృతి అనేది సంయోగం వలన ఏర్పడుతుందని, సాక్షి పురుషునికోసం, చిత్ర, విచిత్ర ప్రదర్శనలు చూపుతుందని,ప్రకృతి ఎప్పుడు ప్రభుస్తానాన్ని ఆక్రమించలేదని గ్రహిస్తాము. వివేకం ఎప్పుడు కల్గుతుందో అప్పుడే భయం సంపూర్ణంగా మన నుండి దూరంగా పారిపోతుంది. అప్పుడే చిత్తానికి కైవల్యం లభిస్తుంది.
పురుషుడు చిత్తం కాదు అనే విషయాన్నీ వివేకం వలన యోగి గ్రహిస్తాడు.దానికి (ఆ కైవల్యానికి) ప్రతిబంధకాలుగ వెలువడే భాగాలు సంస్కారాల వలన కలుగుతున్నాయి. సుఖప్రాప్తికి బహ్యవిషయాలు అవసరమని మన నమ్మకం. ఇటువంటి విశ్వాస హేతువుగల భావాలన్నీ కైవల్య ప్రాప్తికి ప్రతిబంధకాలు. స్వయంగా పురుషుడు సుఖస్వరుపుడు.పూర్ణానందమయుడు కానీ పూర్వ సంస్కారాలతో ఈ జ్ఞానం ఆవరించబడి వుంది.
సర్వతత్వాలను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక వుండేవానికి అటువంటి పరిపూర్ణవివేకం ఫలితంగా ధర్మమేఘం అనే సమాధి కలుగుతుంది.ఇటువంటి జ్ఞానం కలిగిన యోగికి ఎన్నో సిద్దులు కలుగుతాయి, కానీ, నిజమైన త్యాగి వాటినేల్లా పరిత్యజిస్తాడు. అటువంటి వానికి ధర్మమేఘం అనే విచిత్ర వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది.   
అపూర్వ జ్ఞానం వలన (అవిద్యాది) క్లేశాలు, కర్మలు నివృత్త మవుతాయి. దర్మమేఘ మనే సమాధి కలిగితే యోగికి పతన మనేది కలగదు. సర్వక్లేశాలకు, దుఃఖాలకు అతీతుడై పోతాడు.
పురుషుని ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని (సత్వాది) గుణాలను విలోమక్రమంలో లయింపచేయటాన్నిగాని, చిత్ ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెలకొల్పాడాన్ని కానీ కైవల్యమంటారు. ప్రకృతి వహించిన కార్యం పరిసమాప్తమైంది. తనను తను మరచిన పురుషునికి ప్రకృతి, చేయూతనిచ్చి, ప్రపంచానుభావాలను, ద్రుస్యాలన్నితటిని చూపి అతను తను కోల్పోయినా వైభవాన్ని పొంది, స్వస్వరూప జ్ఞానం పొందేవరకు, క్రమక్రమంగా వివిధ శరీరాల మూలంగా అతన్ని ఉన్నతస్తితికి తీసుకొని వస్తుంది.   
స్వస్వరూపాన్ని పొందిన మహానుభావులందరికి జయముకలుగుగాక! వారి ఆశీస్సులు మన అందరు లభించుగాక!

పతంజలి యోగసూత్రాలు : రెండవ అధ్యాయం

ఓం నమో పరమాత్మయే నమః
సాధన పాదం ఏకాగ్రత : దాని అభ్యాసం.
మొదటి అధ్యాయంలో వివరించబడిన సాధనాలు చాలా శ్రద్దగా, సహనంతో సాధన చేయాలి.దానికి క్రియా యోగం తొలిమెట్టు. తపస్సు, స్వాధ్యాయం (ప్రణవజపం), అంటే మోక్షమునకు దరి చూపించే సద్గ్రంద పటణం మరియు ఈశ్వర ప్రాణిదానం అంటే, మన కర్మలయొక్క ఫలితం ఏదైనా (మంచిగాని, చెడుగాని), భగవంతునికే అర్పించటం అంటే. ఏ ఫలితం వచ్చినా ఉద్రేకపడక సమభావంతో స్వీకరించటం.ఈ మూడు క్రియ యోగం.
క్రియయోగం అవిద్య మొదలైన క్లేశాలను క్షీణింప చేసి, చిత్తమును ఏకాగ్రం చేసి సమాధి సిద్ధింప చేస్తుంది. నిరంతరం క్రియయోగం సాధన చేయటం వలన మనోనిగ్రహం కలిగి, తద్వారా సమాధిసిద్దిస్తుంది.
అవిద్య, అస్మిత(అహంకారం), రాగం, ద్వేషం, అభ్నివేశం (ప్రాణంపై మక్కువ) అనే ఐదు క్లేశాలు ఉన్నాయి. పురుషుడు సహజంగా ఆనంద స్వరూపుడు, అవిద్య అంటే అజ్ఞానం, అహంకారం, రాగం,ద్వేషం,ప్రాణంపై తీపి, ఈ క్లేశాలన్ని మనకి సంసారబంధాన్ని కల్పించి దుఃఖానికి కారణాలు అవుతున్నాయి.
అవిద్య అంటే, అనిత్యమైన వాటిని నిత్యంగా, ఆశుద్దాలను శుద్దంగా, దుఃఖ కారణాలను సుఖాత్మకంగా, అనాత్మలను ఆత్మలుగా భావించటమే. శరీరమే ణు అని మనం భావిస్తాము. అనిత్యమైన ఈ ప్రపంచమే నిత్యమను కొంటాం. దుఃఖ కారణాలైన ఐహిక సుఖాలలో ఆనందం ఉండను కొంటాము. సచ్చిదానంద స్వరూపమమైన ఆత్మను గురించి తలచకుండా అనాత్మలను (శరీరాన్ని) నేనుగా భావిస్తాను. ఇదంతా అవిధ్యయే.
ధ్యానం ద్వార వృత్తుల వికారాలను నిరాకరించాలి. ధ్యానసాధన చేత క్షీణింపబదిన క్లేశములను, దగ్ద బీజములగా చేయవచ్చును.చిత్తవృత్తులను నిగ్రహించటానికి గొప్ప సాధనమే ధ్యానం. ధ్యానాన్ని క్రమం తప్పకుండ శ్రద్దగా చేస్తే, రాగద్వేషాలు స్వాదీనం లోకి వస్తాయి.
పైన చెప్పబడిన క్లేశాలు కర్మలాకు మూలకారణం. మనకు కనిపించే ఈ జన్మలో గాని కనిపించని జన్మంతరాలలో కానీ కర్మను భావాలకి కారణం అవుతాయి. పుణ్యపాప కర్మల వలన సుఖదుఃఖ ఫలాలు కలుగుతున్నాయి. మన సుఖదుఃఖ అనుభవాలకు హేతువు మనం చేసిన పుణ్య పాప కర్మలే.
కర్మలు మూడు రకాలు. అవి సంచిత(గత జన్మలలో గతించిన కర్మ) ,ప్రారబ్ద(ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది) మరియు ఆగామి (రాబోయే జన్మలలో ఫలించబోయేది).మనం ఆగామి కర్మను మాత్రం నిరోదించగలం. ప్రయత్నంతో నిర్జించాలి.  {మొత్తం కర్మల గురించి వాటి వివరణ అన్నియు కర్మలు మరియు కర్మలు-II లో చెప్పబడినవి).
ప్రకాశం, క్రియ, స్తితి అనేవాటిని స్వభావంగా కలిగి ఉన్నదే దృశ్యం. అంతే కాకుండా పంచభూతాలు, ఇంద్రియాలతో కుడి వుంది, పురుషునికి భోగ,మోక్షలను ప్రయోజనంగా గలిగించినదే దృశ్యం.
ప్రకృతి, పంచాభూతాలతో, మనసు, ఇంద్రియాలతో గూడి త్రిగునాత్మకమయి వుంది. సత్వం వలన ప్రకాశం, రజోగుణం వలన ప్రవ్రుత్తి మరియు తమో గుణం వలన స్తితి కలుగుతుంటాయి.పుశునికి అనుభవాన్ని కుర్చటమే ఈ ప్రకృతి యొక్క ప్రయోజనం.
 ప్రకృతికి అధీనులు కాకుండా ఉండటమే యోగానికి ప్రధానాశయం. బాహ్యంతర ప్రక్రుతులను నిరోధించటం కోసం కర్మ ఉపాసన యోగ, జ్ఞాన మార్గాలు అవలంభించి ముక్తులు కావాలి.అంతర ప్రకృతిని ఆత్మ సంయమనంతో అంటే ధ్యాన యోగం ద్వార జయించాలి . అలా జయించగలిగిన వాడు, ప్రపంచాన్నంత జయించగలుగుతాడు.
ఎప్పుడైతే మనసు ఆత్మలో తాదాత్మ్యం చెందుతుందో (అది ధ్యాన యోగంలో), ఈ స్తితిని పొందటం వలన యోగి భ్రాంతి రహితుడై, సర్వదుఃఖాతీతుడై, ప్రశాంతచిత్తుడై ఒప్పుతూ, తనే పరిపూర్ణుడనని, సర్వ శక్తి మంతుడనని గ్రహిస్తాడు.
యోగంలో వివిధ అంగాలను అనుస్టించటం వలన చిత్తమాలిన్యాలు తొలగి, వివేకఖ్యాతి కలుగుతుంది.
సహజంగా శరీరానికి వుండే చలనాన్ని నిరోదించటం వలన, అనంతం గురించి, ధ్యానం చేయటం వలన ఆసనం స్తిరమౌతుంది, సుఖకరం అవుతుంది.స్తిరంగా సుఖంగా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేదే ఆసనము. యోగ సాధనకు అటువంటి సుఖసనము చాల అవసరము.అటువంటి ఆసనంలో శరీరం స్తిరంగా వుండగల్గితే శరీరంలో నాడులపై ఎటువంటి వత్తిడి కలుగదు. అప్పుడు చిత్తఏకాగ్రత సులభంగా పొందవచ్చును.
ఆసనం సిద్దించిన తరువాత, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం కూడ సిద్దిస్తుంది. సాధారణంగా ప్రాణం అంటే శ్వాస అనుకొంటారు. కానీ సమస్త విశ్వంలోని సాముదాయక శక్తే ప్రాణం. ఇదేశక్తి ప్రతిశరీరంలోని ఉపిరితిత్తులలో చలనాన్ని కలిగించి తద్వారా ఉచ్ఛ్వాస, నిశ్వాస పరంపరని కల్గిస్తుంది. ప్రాణశక్తి వశం కావాలంటే శ్వాసను వశం చేసుకోవాలి. 
ప్రాణాయామం వలన చిత్తప్రకాశానికి వున్న ఆవరణ తొలగి పోతుంది. చిత్తానికి వున్న వివిధ ఆవరణలు క్షీణించి పోతే కానీ శుద్ధ తత్వాన్ని పొందదు. ప్రాణాయామం చేయగా చేయగా ఈ ఆవరణాలు క్షీణించి నిర్గుణ చిదానంద తత్వాన్ని పొందుతుంది.

పైన చెప్పినట్లుగా ఆవరణ తొలగిపోయిన తరువాత మనసు ఏకాగ్రత గల్గి, ధారణ చేయటానికి యోగ్యమవుతుంది. ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి చిత్తస్వరుపాన్ని పొందటమే ప్రత్యాహారం.

పతంజలి యోగసూత్రాలు : మొదటి అధ్యాయం

ఓం నమో పరమాత్మయే నమః
సమాధి పాదం ఏకాగ్రత : దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు.
ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాల్గింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. ఇవన్ని ఒక విధంగా చిత్తం చేసే వేరు వేరు పనులే. చిత్తంలోని సంకల్పాలనే వ్రుతులు అంటారు. నువ్వే అసలు చైతన్యం. చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే. దాని ద్వార ప్రపంచాన్ని గ్రహిస్తావు. ఒక రాయిని నీటిలో వేస్తే నీటిపై తరంగాలు వస్తాయి. అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే చిత్తంలో ప్రతిక్రియ కలుగుతుంది.నిజంగా, ప్రపంచమంటే, బాహ్య విషయాలలో చిత్తం చేసే ప్రతిక్రియలే.
మనసు తన సహజ శుద్ధావస్థను చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. కానీ ఇంద్రియాలు మాత్రం మనసును బయటకు లాగుతూ ఉంటాయి. మనసు ఇలా ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళకుండా నిరోధించటమే మనోనిగ్రహం. మనసును నిగ్రహించి, ఆత్మలో లయం చేయటానికి, అంతర్ముఖం చేయవలసి వుంటుంది. ఇదే యోగం అంటే.
నదిలో నీరు నిర్మలంగా, ఏవిధమైన కదలికలు లేకుండా, అలలు లేకుండా వున్న సమయంలో అడుగుభాగం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిదంగా మనసులో ఏవిధమైన సంకల్పాలు, ఆలోచనలు లేనప్పుడు మనం మన అంతఃస్వరూపాన్ని కనుగొన గల్గుతాము. మనసు పూర్తిగా మాయమైనప్పుడు మనం ఆత్మ స్వరుపులుగా మిగిలిపోతాము.
ఇతర సమయాలలో అంటే పైన చెప్పినట్లు యోగాస్తితిలో లేనప్పుడు పురుషుడు తన వృత్తులతో తాదాత్మ్యం చెంది ఆయా వృత్తుల రూపాన్ని పొంది వుంటాడు. ఎలాగంటే ఎవరైనా నన్ను బాధపెట్టారను కోండి. దాని వలన నా మనసులో ఒక వ్రుత్తి కలుగుతుంది. ఆ వృత్తిలో నేను తాదాత్మ్యం చెంది, ఆ కారణంగా దుంఖాన్ని పొందుతాను. 
వృత్తులు ఐదు రకాలుగా ఉంటాయి. అవి కొన్ని క్లేశయుక్తాలు, కొన్ని క్లేశరహితాలు.ప్రమాణం, విపర్యం, వికల్పం, నిద్ర మరియు స్మృతి అనే ఐదింటిని వ్రుత్తులు అంటారు.
ప్రమాణం: ii.మనకు కలిగే అనుభవంలో భ్రమ లేకుండా వుంటే, అది ప్రత్యక్ష ప్రమాణం. Ii. లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించగల్గితే అది అనుమాన ప్రమాణం.ఉదాహరునకు పొగను చుచునపుడు నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. Iii. అత్మసాక్షత్కారాన్ని పొందిన యోగుల ప్రత్యక్షానుభావాలే ఆప్తవాక్యంగా ప్రమాణమవుతున్నాయి.ఆగమాలు, శ్రుతులు, స్మృతులు వారి ద్వారానే వస్తున్నాయి. అటువంటి వేదశాస్త్రాలు మనకు వేదం ప్రమాణాలు.
విపర్యం : లేని వస్తువు రూపంలో ఒక వస్తువు గోచరిస్తే ఆ మిధ్యాజ్ఞానమే విపర్యయ వ్రుత్తి. ముత్యపు చిప్పలో మెరుపును చూసి, అది వెండి అనుకుంటే, అదే విపర్యయ వ్రుత్తి.
వికల్పం : శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్దజ్ఞానంతో అనుసరించే వ్రుత్తి అంటే ఏదైనా ఒక శబ్దాన్ని వినిపించగానే, ఆ శబ్దర్ధాన్ని విచారించకుండా, మనోదౌర్బల్యంతో లేని వస్తువుని నిర్ధరించటమే వికల్పవ్రుత్తి. ఉదాహరున గోడ్రాలి కుమారుడు.
నిద్ర : నిద్రించే సమయంలో చిత్తంలో ఎటువంటి వృత్తులు లేకపోతే, అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు ఏవి కలగవు. అనుభవాలు కలగనపుడు, వాటిని స్మరించే ప్రసక్తి వుండదు. కానీ నిద్రించాను అనే స్మృతి మనకు అనుభవంలో కలుగుతోంది కనుక నిద్రావస్థలో కూడ చిత్తంలో వృత్తులు వుండటం నిజం. కనుక నిద్ర కూడా ఒక వ్రుత్తి.
స్మృతి : మనం అనుభవించిన విషయాలు గుర్తు రావటమే స్మృతి అనబడే వ్రుత్తి. ప్రత్యక్షానుభవం, మిధ్యాజ్ఞానం, వికల్పం, నిద్ర అనబడే వృత్తుల ద్వార స్మృతి కలుగవచ్చును. జగ్రుత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వప్నంగా రూపుదాల్చుతుంది.
పై వ్రుత్తులన్నింటిని అభ్యాసం, వైరాగ్యం ద్వార నిగ్రహించవచ్చును. అభ్యాసం అంటే సాధన. వైరాగ్యం అంటే ఏ విషయాలయందు ఆశ, రాగం లేక పోవటమే. పైన చెప్పబడిన వ్రుత్తులన్నింటిని నిరోదించాలంటే అది అభ్యాసం మరియు వైరాగ్యం వలననే సాధ్యం అవుతుంది. సాధనద్వారా సద్వర్తన అలవరచుకొని, సత్సీలం పొందవచ్చును.      
ఆ సాధనని, ఆ అభ్యాసాన్ని చాల కాలం శ్రద్దతో కొనసాగిస్తే, అప్పుడు స్తిరమైన స్తితి కలుగుతుంది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన సాధించలేము. శ్రద్ద, బ్రహ్మచర్యము, తపసు మొదలైన సత్కార్యములతో ఆ సాధన చేయాలి. వైరాగ్యం రెండు రకాలు.. i.అపర వైరాగ్యం ii.పర వైరాగ్యం.
అపర వైరాగ్యం : ఇహలోకంలో చూడబడినవియు, వేదముల ద్వార వినబదినవియు అయిన భోగావిషయములయందు ఆసక్తి లేని చిత్తమునకు కలుగు వశీకార సంజ్ఞ అనే వైరాగ్యం.ప్రాపంచిక విషయాలలో ఆశ, అనురక్తి లేకుండా, వాటికీ వశం కాకుండా, వాటినే తన వశంలో వుంచుకోగల్గటమే వైరాగ్యం. అటువంటి మనోబలం, వైరాగ్యం, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.    
పరావైరాగ్యం : పరావైరాగ్యం అత్యున్నతమైనది. అపర వైరాగ్యవంతునికి గుణములు వేరు, పురుషుడు వేరు అనే దృడమైన వివేకజ్ఞానం కలుగుతుంది. ఇది కలిగిన వణికి ఇంతవరకు ఉపకరనములుగా వున్న గుణముల విషయము నందు కూడా వైరాగ్యం కలుగుతుంది.చిత్తము వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానమందు కూడా వైరాగ్యం కలుగుతుంది. ఇదియే పరావైరాగ్యం.ఇట్టి ధ్రుడమైన వివేకము కలిగిన వణికి భోగావిషయములయందేకాక, వివేకఖ్యాతినందు కూడా వైరాగ్యము కలుగును. జ్ఞానము యొక్క ఈ అత్యున్నత స్తితియే పరావైరాగ్యం.
సమాధి రెండు విధాలు : i.సంప్రజ్ఞాత సమాధి ii. అసంప్రజ్ఞాత సమాధి.
సంప్రజ్ఞాత సమాధి : సంప్రజ్ఞాత సమాధి వలన ప్రకృతిని వశపరచుకోవటానికి కావలసిన శక్తులన్నీ లభిస్తాయి.సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు. సర్వసిద్దులు పొందిన యోగి పతనం కావచ్చును. సంప్రజ్ఞాత సమాధిలో నేను అనే జ్ఞానం ఇంకభాసిస్తూ వుంటుంది. సంస్కార బీజాలు ఉంటాయి.
అవ్యక్త సంస్కారం మాత్రమే చిత్తంలో శేషించి, చిత్తవృత్తుల నన్నింటిని నిరాకరించే సమాధి నిరంతరాభ్యాసం వలన లభిస్తుంది. దీనినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు.ఇది ఇంద్రియాతీతమైన జ్ఞానవ్యవస్థ. దీనివలన మాత్రమే మోక్షం లభిస్తుంది.
ఆస్తిక్య బుద్దితో యోగాన్ని సాధించవలననే ఉత్కంటను శ్రద్ద అంటారు. అటువంటి శ్రద్ద గలవారు ఎన్నో ఆటంకాలను అధిగమించగలుగుతారు. శ్రద్దవలన వీర్యము, అంటే వివేకము గుర్చిన ధారణ (ఉత్సాహము), తద్వారా స్మృతి అంటే ధ్యానము కలుగును. ధ్యానము వలన సమాధి , సమాధి వలన ప్రజ్ఞ అంటే తత్వసక్షాత్కారము కలుగును. ఇదియే ప్రజ్ఞ. తీవ్ర కార్యదీక్ష ఉన్నవారికి ఫలితం త్వరితంగా లభిస్తుంది.అతి తీవ్ర సంవేగులకు చాల త్వరితంగాను యోగము సిద్దిస్తుంది.
కర్మఫలాలను ఎస్వరునుకి సమర్పించటం ద్వార కూడా యోగం సిద్దిస్తుంది. భక్తితో ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు, అతనిపై చిత్తము నిలుపుట ద్వార కూడా యోగాసిద్ది లభించును.
సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా వుంటుంది. అత్యదికమైన జ్ఞానం (నిరతిశయంగా) ఒక్క ఈశ్వరునిలో మాత్రమే వుంటుంది. కాలము చేత భాదింపబడనివాడు అంటే కాలాతీతుడు కావటం చేత, అతడు సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. అతడే అఖండ జ్ఞానస్వరుపుడైన భగవంతుడు. అతడు కాలము చేత కొలవబడనివాడు.
శారీరక రోగం, మానసిక జడత్వం, సంశయం, అజాగ్రత్త మత్తత, అసంతృప్తి, భ్రమ, చిత్తస్తైర్యం నిలువకున్దుట అనేవి యోగానికి అంతరాయాలు.దుఃఖ0, చిత్తక్షోభం, శరీరకంపనం, క్రమరహితశ్వాస అన్నవి చివిక్షేపనికి తోబుట్టువులు వంటివి. చిత్తం శాంతిగా లేనప్పుడు శరీరం కంపించటం, శ్వాస క్రమరహితంగా జరగటం, దుఃఖ0 కలగటం జరుగుతుంటాయి.
అటువంటి చిత్తక్షోభని, చంచల్యాన్ని నివారించటానికి, ఎకతత్వాన్ని అభ్యసించాలి. అంటే క్రమం తప్పకుండ కొంతకాలం మనసునొకే విషయంపై (అంటే హృదయంలో జ్యోతి వుందని) నిలిపి ధ్యానం చేయాలి.
నిరంతర ధ్యానం వలన యోగి చిత్తంలో ధ్యేయం తప్ప మిగిలిన వృత్తులు క్షీణించి ఆచిట్ట్టం ఆత్మ లేక పురుషునిలో తాదాత్మ్యం పొందుతుంది.ఈ విధముగ గ్రహీత్రాదులపై నిలిచినా చిత్తము తదాకారము పొందుటయే సమాపత్తి. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందుటయే సంప్రజ్ఞాత సమాధి ఫలము.
స్మృతి పరిశుద్దమగుచు రాగా ధ్యాన భూమిక శబ్ద, అర్ద, జ్ఞానములు పురుషుడు సంపూర్ణముగా తెలిసికోనుచున్నాడు.
పై సూత్రంలోని శబ్ధర్ధజ్ఞాన మిశ్రమ సవితర్కధ్యాన సాధన వలన, ఈ మూడు కలియని నిర్వితర్క సమాధి స్తితి లభిస్తుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే, సమస్త వృత్తులకు ఆశ్రమమైన స్మృతి పరిశుద్దమౌతుంది. అప్పుడు శబ్దార్ధజ్ఞానా లను వేరు వేరుగా గ్రహింపగలం. దీనినే నిర్వికల్ప సమాధి అంటారు.
నిర్విచార సమాధి వలన ఆధ్యాత్మ ప్రసాదమైన స్టిరా చిత్తం కలుగుతుంది.నిర్విచార సమాధి యందలి ప్రజ్ఞ సత్యపరిపూర్ణమైనది. ఈ స్తితిని అందుకొనిన యోగి పొందెడి ప్రజ్ఞాయే ఋతంభర (kinetic energy) సత్యము (static energy)సృష్టికి మూలము, మరియు అచలము. ఋతము చలింపచేసే శక్తి. 
నిర్విచార సమాధి సాధన చిరకాలం కొనసాగిస్తే సమస్త వృత్తులకు ఆశ్రయమైన స్మృతి శుద్దమవుతుంది.ఈ సమాధి వలన కలిగే సంస్కారం అంటే ప్రజ్ఞా విశారదత్వము, ఋతుంభరత్వము ఇతర సంస్కరములు అన్నింటిని నిగ్రహిస్తాయి. చిత్తాన్ని ఏకాగ్రం చేయటాన్ని ప్రయత్నం ప్రారంభించగానే, చిత్త వృత్తులు విజ్రుంభిస్తాయి.ఏకాగ్రతని లభించనీయవు. కానీ పైన చెప్పిన సాధన వలన చిత్త ఏకాగ్రత పెరిగి, తద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలను నిరోదించ గల్గేంత ప్రబలంగా ఉంటాయి.  

ఋతంభర ప్రగ్నవలన ఇతర ప్రకృతి జన్యములైన సంస్కరములన్ని నిరోదింపబడును. ఇతర సంస్కారాలను నిరోదించే ఈ సంస్కారాన్ని కూడా నిరోదించటం వలన సర్వం నిరోదితమై నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. 

Sunday, December 1, 2013

వేదవ్యాసుడు :


ఓం నమో పరమాత్మయే నమః 
భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.
ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. వాటిని తన నలుగురు శిష్యులకు ఉపదేశించి ప్రచారం చేయమని ఆదేశించారు. వేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టమని, అందరికి అర్దమయ్యే విధంగా వేద సారం మొత్తాన్ని అష్టాదశ(18) పురాణాల్లోనూ, ఉపపురాణాల్లోనూ నిక్షిప్తం చేశారు. బ్రహ్మసూత్రాలను రచించారు. పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంధస్థం చేశారు. ధర్మాచరణలో వేదమే ప్రామాణికం. మన సంస్కృతికి ఆది, పూనాది వేదమే. అటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేసిన వేదవ్యాస మహర్షికి కృతజ్ఞతగా ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.

వ్యాసమహర్షి తనకు పరంపరాగతంగా వస్తున్న విద్యను తన పుత్రుడైన శుకమహర్షికి ఉపదేశించాడు. శుకమహర్షి గౌడపాదాచార్యులవారికి, ఆయన గోవిందపాదాచార్యులవారికి, గోవిందపాదులు శ్రి శంకరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని బౌద్ధ, చార్వాక, జైన మతాలు అంతం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు కైలాస శంకరుడే ఆదిశంకరాచరుడిగా అవతరించాడు. శ్రీ శంకరాచార్యులవారు దైవ, ఋషి పరంపరగా వస్తున్న ఈ మహాద్భుత జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులైన పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని పునరుద్దరించారు.

ఆత్మ జ్ఞానమైన, బ్రహ్మజ్ఞానమైన, వేదమైన, ఎటువంటి జ్ఞానమైన ఆధునిక కాలంలో కొత్తగా తెలుసుకుని/కనిపెట్టి చెప్పినవారు లేరు. నారాయణుడి దగ్గరినుండి పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని, ఏదైతే వ్యాసుడి చేత చెప్పబడిందో, అది మాత్రమే చెప్తారు. వ్యాసుడి చెప్పినదానికి భిన్నంగా ఏది చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో పురాతనమైన, సనాతమైన ఈ సంపద మనకు అందడంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యాసమహర్షిని మన గురువులలో చూసుకుని ఆరాధించడమే గురు పూర్ణిమ.

వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే!

గురు అనే శబ్దానికి చీకటిని పోగెట్టేవాడు అని కూడా అర్థము ఉంది.
చీకటి అఙ్ఞానాన్ని పోగొట్టి ఙ్ఞానం అనే వెలుతురు చూపించే గురువుకి నేను నమస్కరిస్తున్నాను

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము:


ఓం నమో పరమాత్మయే నమః 
1.      దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.
2.      కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.
3.      ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.        
4.      పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.
5.      బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.
6.      భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.
7.      నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే సరళధ్యానం ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.
8.      పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది.        
9.      ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.
10.  మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
11.  వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
12.  ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
13.  లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
14.  ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.
15.  మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?
16.  దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.
17.  మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
18.  వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
19.  నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.
20.  ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.
21.  అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమైయున్నది.
22.  దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.
23.  సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?
24.  శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.
25.  ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.
26.  ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.
27.  జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము.సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరువస్తువు ఏమున్నది.
28.  తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.
29.  తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.
30.  నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది.
దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని? ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసితున్నాడు.

కామాన్ని జయించడం ఎలా?


ఓం నమో పరమాత్మయే నమః
కామం అంటే ఏమిటి? దీనిని మనం ఎందుకు జయించాలి? దీన్ని జయించడం వలన మనకు కలిగే ప్రయోజనాలేంటి? మొదట కామం అంటే ఏమిటో తెలుసుకుందాం. కామం అనగానే చాలా మందికి చాలా భావనలు ఉంటాయి. ఇంకా కొందరు ఏవేవో కూడా ఊహించుకుంటారు.అసలు కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే. అంటే ఉదాహరునకు మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే ఏవేవో భావనలు అన్నీ కూడా అందులో ఒకే ఒక భాగం మాత్రమే అంతే తప్ప కామం అంటే ఏవేవో కాదు. సరే ఈ కోరికలు వుండడం వలన ఏమవుతుంది? ఎవరికైనా పుట్టిన ప్రతి మనిషికి కోరికలు వుండడం సహజం కదా. కోరికలు ఉంటే ఏమవుతుంది. మనకు కావలసినవి అన్నీ మనకు కావాలి కదా మరి? లేకపోతే ఎలా బ్రతికేది అని చాలా మందికి సందేహం కూడ వుంటుంది. అవును కదండీ మరి. కోరికలు వుండాలి కాని దానికి ఒక పరిమితి ఉండాలి. అంతే కాని అత్యాస ఉండకూడదు. కాని ఇక్కడ వచ్చిన ఒక చిక్కు సమస్య అంత ఏమిటంటే కామాన్ని జయిస్తే గాని మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగువేయలేము. ఆ విధంగా ఆలోచిస్తే దీనిని జయించడమే మేలు అని అనిపిస్తుంది.

అందులోను ఎక్కడ చూచిన ఈ కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలను జయించిన వాడు మాత్రమే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళతాడు అన్నది మనకు అన్ని వేద గ్రంధాలలో తెలియపరచినారు. అంతేకాక కామ,క్రోధ,లోభ,మోహ, మద,మాత్సర్యాలలో కూడ మొదట కామం నే తీసుకున్నారు. ఎందుకంటే కామం వెనుక ఉన్నవి అన్నీ కూడా కామం  నుండే మరియు కామం వలననే కలుగుతాయి కాబట్టి ఇక్కడ కూడ మొదట కామాన్నే ప్రస్తావించారు. ఇదే విషయాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు “విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.” అంటే కామం వుండడం వలన చాల చాల దుష్ప్రయోజనాలు వున్నాయి. అదే విధంగా మనం ఇంతవరకు జ్ఞానాన్ని గ్రహించకపోవడానికి మనం ఈ జనన మరణ చట్రంలో ఇరుక్కొని పోవడానికి కారణం కూడ ఈ కామమే. దీనిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు “అర్జునా! పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది. కాబట్టి దీన్ని జయించడమే ఉత్తమం.

వీటితో పాటు ఈ కామం మూలంగా మన మనస్సులో కూడ ఎప్పుడు సముద్రంలో అలల లాగ మన మనస్సులో కూడ అలలు వస్తూనే ఉంటాయి. అంటే మన మనస్సులో కలిగే మరియు జరిగే ప్రతి అలజడికి కారణం ఈ కామమే మూల కారణం. అందువలన కామాన్ని (కోరికలను) అణచివేస్తే గాని మనం మన లక్ష్యానికి* మనం దగ్గర అవలేము. కాని కోరికలను ఎలా అణచివేయాలి? కామాన్ని ఎలా జయించాలి?  
(*లక్ష్యం : లక్ష్యం అంటే మొదటిది స్థితప్రజ్ఞత(సమానుభావము) మరియు మనస్సును నశింపచేయాలి. ఈ రెండు కూడ మనకు భగవంతునిని దగ్గరకు చేస్తాయి.మనకు ధ్యానంలో ఆ దేవదేవుని సాక్షాత్కారానికి సహకరిస్తాయి.)

మనం కామాన్ని ఎందుకు జయించాలో తెలుసుకున్నాము. కాని ఎలా జయించాలో చూద్దాం. కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాల కష్టమైన పనేమీ కాదు. దీనిని జయించడం చాల చాల సులువైన పని. దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకులపరచడమే అంతే. దాన్ని జయించినట్లే. దానిని సానుకులపరచడం అంటే దానికి శాస్వతతత్వాన్ని తెలియపరచి, శాశ్వతమైన దానిని తెలియజేసి నిత్యమైన దాని కోసం వెతకడం ప్రారంభిస్తే చాలు. అది అప్పటి నుండి దాని మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఇంత వరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి  కోసం ప్రాకులాడుతున్నాము. ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు ద్రుష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ది అనే సాధనంతో మనస్సులో కరిగే కోరికలనన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన, నిత్యమైన, లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచులోవాలి. ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మమీద మాత్రమే కోరిక కలుగుతుంది. దీనితో పాటు మనం కొన్నిటిని ప్రతిదినం అలవారచుకుంటే మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే. అవి
-          మొదట మనం భగవంతుని ముందర కోరికలను కోరడం (అంటే అవికావాలి,ఇవికావాలి అని) కోరుకోకూడదు. జరిగిపొయినవి అన్నియు మన మంచికే, జరగబోతున్నవి కూడా మన మంచికే అని ముందు మన మనస్సును సమాధానపరచాలి.
-          రోజు చేసే పనిని అది ఏదైనా భగవంతార్పణ బుద్దితో, నిష్కల్మషంగా (అంటే ఎటువంటి కల్మషం లేకుండా), ఫలాపేక్షరహితంగా కర్మలను ఆచరిస్తూ వుంటే అప్పుడు నీ మనస్సు అంతఃకరణ నిదానంగా ఖచ్చితంగా పరిశుద్దమై అదే కోరికలను త్యజిస్తుంది ఎందుకంటే అప్పుడు నీ మనస్సుకు ఒక భావన కలుగుతుంది అది ఏమిటంటే ఇవి అన్నియు అనిత్యమైనవి కదా అనే భావన రోజు రోజుకు నీలో అధికమవుతుంది.
-          ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు అట్లే కూర్చొని సాధన(ధ్యానం) చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలు అన్నీ అవియే సమసిపోతాయి అంతేకాక నీ మనస్సు కూడ చాల హాయిగా, ఆనందంగా వుంటుంది.
-          అదే విధంగా ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు కూడ మంచం ఎక్కగానే ఒక 10 నిముషాలు కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు కూర్చొని సాధన(ధ్యానం) చేసి ఆ తరువాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాల ప్రశాంతమైన మరియు చాల సుఖవంతమైన నిద్ర వస్తుంది.(దీనినే నిద్రలో నిశ్చింతత అంటారు) ఉదయం నువ్వు లేవగానే నీ మనస్సుకు ఒక relief reliefrelief వచ్చినట్లుగా వుంటుంది.   

ఈ విధంగా మనం మన ఆలోచన విధానాలను మరియు ఎంచుకొనే మార్గాలను ఒక శాశ్వతమైన దాని మీదకు మరలిస్తూ వుంటే మిగిలినవి అన్నియు వాటికవే సర్దుకుంటాయి. అప్పుడు నువ్వు సంపూర్ణంగా కామాన్ని జయించిన వాడివి అవుతావు. 

Friday, November 29, 2013

జ్ఞానం అంటే ఏమిటి? :

ఓం నమో పరమాత్మయే నమః 
జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. దీనినే చాల మంది వేరే వారిని అవహేలనగా కూడ, తమాషాగా కూడ మాట్లాడుకుంటారు.అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం? 
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన BB.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.    
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.
జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.
శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.
1.      ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2.      జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3.      అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4.      ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5.      అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.

6.      పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.