My Blog List

My Blog List

Thursday, April 3, 2014

వ్యాసమహర్షి కుమారుడు శుక మహర్షి పరీక్షిత్తునకు ధారణ గురించి తెలియచెప్పుట:

మృత్యువు సమీపించుచున్నప్పుడు మృత్యు భయమును వీడవలెను. త్యాగమను కత్తితో భార్య, పిల్లలు, ఆస్థిపాస్తులతో నున్న బంధములను తెగనాడవలెను. ధ్యానమునకు కూర్చోనవలెను. ధ్యానము సలుపు ప్రక్రియను నేను వివరముగా తెలిపెదను.

ప్రాణాయామముతో మనస్సును నిశ్చలముగా ఉంచవలెను. ఓం అను యేకాక్షరమును పదే పదే ఉచ్చరించవలెను. మనస్సును నిగ్రహించిన తర్వాత, రథసారధి వలె బుద్ధి కళ్ళెము పట్టుకొని మనస్సును భగవంతుని మననము గావించు మార్గమున తీసుకువెళ్ళగలదు. మనస్సు ఇంద్రియములకు వశము కాకుండా చూడవలెను. భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించుటకు అష్టాంగాయోగమనే ప్రాధమిక యోగ ప్రక్రియ సహాయపడును. ఈ యోగము ఎనిమిది గుణములతో కూడుకొని యున్నది. ఈ గునములన్నీ నీలోని అంతర్భాగములు కావలెను. అవి యేవనగా, అహింస ఇతరులకు హాని కలిగింపకుండుట; సత్యము నిజాము పలకుట; అస్తేయము ఇతరులకు చెందిన వాటిని దొంగిలింపకుండుట; బ్రహ్మచర్యము ఇంద్రియములను నిగ్రహించుట; అపరిగ్రహము ఇతరుల నుండి వస్తువుల గ్రహింపకుండుట; శౌచము లోపల బయట నిర్మలముగా ఉండుట; తపస్సు సాధన చేయుట; స్వాధ్యాయము శాస్త్రములను చదివి వాటిని తెలుసుకొనుట ఈ ఎనిమిది గుణములను ధారణ అందురు. ఇది తరువాత చేయు ధ్యానమునకు నాంది.

No comments:

Post a Comment