My Blog List

My Blog List

Friday, November 29, 2013

జ్ఞానం అంటే ఏమిటి? :

ఓం నమో పరమాత్మయే నమః 
జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. దీనినే చాల మంది వేరే వారిని అవహేలనగా కూడ, తమాషాగా కూడ మాట్లాడుకుంటారు.అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం? 
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన BB.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.    
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.
జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.
శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.
1.      ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2.      జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3.      అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4.      ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5.      అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.

6.      పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది. 

అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ

ఓం నమో పరమాత్మయే నమః 
కర్మబంధము, ముక్తికార్యము, కారణము స్థూలసూక్షము. ఈ ద్వంద్వ సంబదితమే దేహము అనబడును. జీవుడంటే వేరెవరూ కాదు.
అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకీ, బుద్ధికీ సాక్షి సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కుండవలె రూపాదిగా వున్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మమాత్రము కాదు. ఇదేవిధంగా ఇంద్రియాలుగానీఅగోచరమైన మనస్సుగానీ, అస్థిరమైన ప్రాణముగానీ ఇవేవీ కూడా  ‘ఆత్మకాదు అని తెలుసుకో. దేనివలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగాతెలిసికొని ఆత్మపదార్థమే నేనై వున్నానుఅనే విచికిత్సను పొందు. ఏ విధంగానైతే అయస్కాంతమణి తాను ఇతరాచలచేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షించునో అదేవిధంగా తాను నిర్వికారియై బుద్ధ్యాదులను సైతము చలింప చేస్తుందో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియమనః ప్రాణాలు భాసమానాలౌతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాదులనూ, వాటి ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీనత్వ, నాశాంగ తత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా --- ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం” (నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్ఛబ్దార్థాన్ని గ్రహించాలి. (తత్ శబ్దానికి బ్రహ్మఅని అర్థం.)

సాక్షా ద్విధిముఖాత్ అంటే – “సత్యం జ్ఞానమనంతరం బ్రహ్మ అనే వాక్యలద్వార సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే ఆత్మనరయగలగాలని అర్థము. ఆ ఆత్మ’  సంసార లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టి గోచరము కాదని, చీకటి నెరుగనిదనీ లేదా చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ పూర్వోక్త సాధనలవలన తెలుసుకో దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేఅని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు. అదే నేను తదను ప్రవిశ్యఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వమూ సర్వజీవ కారణ కర్ర్తుత్వమూ దేనికైతే చెప్పబడుతూ వుందో అదే బ్రహ్మ’  గా తెలుసుకో.

ఓ జిజ్ఞాసా ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తనేనని త్వంశబ్దం సాధనమేగానీ, ఇతరం కాదని తేలిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణమననాదికాల నాచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురుకటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిన చేరతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా వుండి, తత్ఫలితాన్ని  దైవార్పణం చేస్తూండడం వలన ప్రారబ్దాన్ననుసరించి ఆ జన్మలో గానీ, లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాస పరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకొని ముక్తులవుతారు.అని అంగీరసుడు చెప్పగా ......ధనలోభుడు నమస్కరించెను.

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు

ఓం నమో పరమాత్మయే నమః 
వీరగురుడు దాచకుండా వివరించెను ఈ గుట్టు :
1.      సద్గురుని బోధను మనసులో మననము చేయరా                         8. శాంతిని ఆశ్రించు
2.      మనిషి చేసిన మంచి ఒక్కటే చేరిపివేసిన చేరగబోదుర                    9. ధర్మము పాటించు
3.      పరమాత్ముని పూజించు                                                             10. నీతిని పాలించు
4.      నిరుపేదల ప్రేమించు                                                                   11. నడవడి దిద్దుకో
5.      పెద్దలను సేవించు                                                                       12. ధ్యానము నిలుపుకో
6.      బుద్దిని అదుపులో వుంచు                                                          13. జ్ఞానము పెంచుకో
7.      హింసను విసర్జించు                                                                    14. సత్యము తెలుసుకో
-          మరల జన్మము ఎత్తకుండ మార్గము కనిపెట్టు
-          ఆదిలోన కులమతాలు లేవు, వాడు వీడు అను తేడ లేదు
-          దేహానికి ఈ భేధాలన్ని, అంటరాని తనము ఆత్మకు లేదు.
-          ఏకాగ్రతతో మనసు నిలిపిన ఓంకారము వినిపించునురా
-          భ్రూ మధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా

-          ఆ చిదానంద మూర్తిని దర్శించిన ముక్తి నీకు ప్రాప్తించునురా 

బ్రహ్మ యొక్క కాలం ఎంత?

ఓం నమో పరమాత్మయే నమః 

ఒక లఘువుని ('' అనే లఘువు పలికే సమయాన్ని నిమేషము అని అంటారు). ఒక రెప్పపాటుకి కూడా నిమేషము అని పేరు. ఇటువంటి నిమేషములు 15 అయితే ఒక కాష్ట అని పేరు. ఇటువంటి కాష్టలు 30 అయితే ఒక కళ. ఇటువంటి కళలు 30 అయితే దానికి ఒక ''క్షణం'' అని పేరు. ఇటువంటి 12 క్షణములు ఒక ముహూర్తం. 30 మూహూర్థములు ఒక రాత్రి ఒకపగలు(మన కాలమానం ప్రకారం ఒకరోజు). 24 గంటల కాలానికి ముప్పై ముహూర్తములు అంటారు. ఇటువంటి అహోరాత్రములు(ఒక పగలు ఒకరాత్రి అంటే ఒకరోజు) 15 ఐతే ఒక పక్షం. ఇటువంటి పక్షములు రెండు ఐతే (30 రోజులు) ఒక మాసం. నెలకి ముప్పై ముప్పైలు 900 ముహూర్తములు ఉన్నాయి. ఇలాంటి మాసములు రెండు అయితే ఒక ఋతువు. ఇలాంటి ఋతువులు 6 అయితే ఒక సంవత్సరం. ఈ సంవత్సరానికి 3ఋతువులు ఒక అయినం. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెండుకలిసి ఒక సంవత్సరం. ఈ సంవత్సరకాలం దేవతలకి ఒక రోజు. ఇక యుగములు 4ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగానికి మాంధాత యుగపురుషుడు. త్రేతాయుగానికి రాముడు యుగపురుషుడు. ద్వాపరానికి ధర్మరాజు యుగపురుషుడు. ధర్మరాజు పేరు మీద యుధిష్టిర శకం అని ఒక శకం కూడా ఉన్నది. కృతయుగానికి 17,28,000 సంవత్సరాల కాలం ఉంది. త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలకాలం ఉంది. ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరాలకాలం ఉంది. కలియుగానికి 4,32,000. సంవత్సరాలకాలం ఉంది. ప్రస్తుతం కలియుగం మొదటి పాదంలో 5113సంవత్సరాల కాలం గడిచింది. కలియుగం 4,32,000 సంవత్సరాలని 2,3,4తో గుణిస్తే వరుసగా ద్వాపర, త్రేతా, కృతయుగముల కాలం వస్తుంది. ఈ నాలుగు యుగాలని ఒక దివ్యయుగం అంటారు. ఈ దివ్యయుగానికి 43,20,000 సంవత్సరాల కాలం పడుతుంది. ఇలాంటి దివ్య యుగాలు (432 కోట్ల సంవత్సరాలు) 1000 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు. (432 కోట్ల సంవత్సరాలు) ఇంతే కాలం ఒక రాత్రి. ఇటువంటి 864 కోట్ల సంవత్సరాలు ఒక రోజు. ఇలాంటి ఒకరోజు గడిపిన ఆయనకి పితామహుడు అని పేరు. ఈ మన్వంతరాలు 14 ఉన్నాయి. ఒక్కో మనువు 71 మహాయుగాలు రాజ్యపాలన చేస్తాడు. బ్రహ్మ పగటికాలంలో 14 మంది మనువులు వెళ్ళిపోతున్నారట. ఒక మనువు వెళ్లి ఇంకో మనువు వచ్చేకాలంలో మహాప్రళయం వస్తుంది. 71 యుగాలు ఒక మనువు పాలించి వెళ్ళిపోయి మరొక మనువు వచ్చే సరికి ఈ మధ్యకాలంలో ప్రళయం వస్తుంది. మనువు ఉన్నంతకాలం ఇంద్రుడు కూడా ఉంటాడు. స్వాయంభువ మనువు, స్వారోచిస మనువు ఇలాంటి మనువులు 7గురు వల్లిపోయారు. ఇప్పుడు వైవస్వత మనువు కాలం నడుస్తుంది. ఇప్పటికి 7మహాప్రళయాలు గడిచాయిఈ మహాకల్పంలో. ఈప్రళయం ఆదియుగం కాలం పాటు ఉంటుంది. అంటే 17,28,000 సంవత్సరాలకాలం పాటు ప్రళయం ఉంటుంది. ఈ ప్రళయ కాల సమయంలో మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది సృష్టి అంతా! ఈ ప్రళయం అంతా బ్రహ్మ నిద్రించే సమయంలో జరుగుతుంది. బ్రహ్మ నిద్రలేచే సమయానికి ప్రళయం వెళ్ళిపోతుంది. నిద్రలేవగానే బ్రహ్మ సృష్టి మళ్లి మొదలుపెడతాడు. ఈ ప్రళయానికి నైమిత్తిక కల్పము అని పేరు. బ్రహ్మదేవుడు నిద్దుర పోయే సమయం, ఈ ప్రళయకాల సమయానికి నైమిత్తిక కల్పం అని పేరు. ఇటువంటివి ముప్పై దినములు బ్రహ్మకి ఒక నెల. అటువంటివి 12 అయితే ఒక సంవత్సరం. అటువంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. దీనిని ఒక మహా కల్పం అని పేరు. దీనికి పూర్వ, అపర అని రెండు భాగములు. పూర్వ మహా కల్పాన్ని పద్మ కల్పం అంటారు. అపరానికి వరాహ కల్పం అని పేరు. ఇప్పుడు మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం.


Wednesday, November 20, 2013

ఆత్మ జీవాత్మనా.....? జీవాత్మ ఆత్మనా..........? పరమాత్మ ఎవరు, ఎక్కడుంటాడు...? పరమాత్మను ఆత్మ పొందుతుందా? జీవాత్మ పొందుతుందా.......?

ఓం నమో పరమాత్మయే నమః


ఆత్మ జీవాత్మనా.....? జీవాత్మ ఆత్మనా..........? పరమాత్మ ఎవరు, ఎక్కడుంటాడు...? పరమాత్మను ఆత్మ పొందుతుందా? జీవాత్మ పొందుతుందా.......?

పరమాత్మా: సృష్టికి పూర్వం ఒకే ఒక పదార్ధం వుంది అదియే శక్తి, అదియే పరమాత్మ. సృష్టి జరిగినపుడు ఆ శక్తే ప్రకృతిగా మారింది. అంటే బంగారం నుండి మనం వేరే వేరే నగలను ఎలా తాయారు చేస్తామో వాటిని అన్నిటిని కరిగిస్తే తిరిగి బంగారం అవుతుంది. అదేలాగు ఈ సృష్టి కూడ పరమాత్మలోనే వుంది. అంతే కాని పరమాత్మ వేరే ఎక్కడో లేడు. అంటే ఇప్పుడు ఒక నీటి కొలను వుంది అనుకోండి. ఆ నీటి కొలనులో నీటి బుడగలు వస్తాయి మరల అవి నీల్లగా మారి అందులోనే కలిసిపోతాయి. అదేలగు పరమాత్మలోనే సృష్టి అంతా వుంది. దీనినే శ్రీ కృష్ణ భగవానుడు అర్జునికి...అర్జునా సమస్తం నాలోనే వుంది అని చెప్తాడు.పరమాత్మా అంటే అనంత సాగరం. అందులోనే మనం వున్నాము.

ఆత్మ : ఆత్మ అంటే పరమాత్మనే అదేలాగు అంటే సృష్టి జరిగిన తరువాత పంచ భూతాలతో నిర్మితమియన్ ఈ నిర్జీవ పదార్థానికి(శరీరానికి) శక్తి ఆత్మే అది ఇందులో వుంది. అయితే ఆత్మే పరమాత్మ ఎలాగు అంటే ఒక సముద్రము నుండి ఒక నీటి బొట్టును పక్కకు తీస్తే అది సముద్రపు నీటికి ఎలా సమానమో అదేలగు ఆత్మ కూడా పరమాత్మనే . అయితే ఆత్మ ఏమి చేయుటలేదు.ఎలాగంటే మనం ఒక ఇంట్లో ఉంటాము మనం ఒక క్రొవ్వత్తి వెలుగు ద్వార మనం పని చేసుకుంటాము అంటే ఇక్కడ క్రొవ్వత్తి ఏమి పని చేయుటలేదు అదేలగు ఆత్మ యొక్క శక్తి చేత శరీరము, మనస్సు మరియు బుద్ది పని చేసుకోనుచున్నవి.ఆత్మ యొక్క తత్వాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చాల విపులంగా వర్ణించాడు.

జీవాత్మ: జీవాత్మ అంటే మనం అహంకారంతో, అజ్ఞానంతో మరియు అవిద్యతో సత్యాన్ని తెలియక నేను అనే అహంకారంతో ప్రోగు చేసుకున్న కర్మలు మరియు ఆత్మను కలిపి జీవాత్మ అని అంటాము.ఇందులో ప్రోగు చేసుకున్న కర్మలకు ఆత్మకు ఎటువంటి సంబందము ఉండదు. అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలు తొలిగిపోవడానికి మనం కర్మలు చేస్తూ వుంటాము. వీటి వేటితో కూడా ఆత్మకు సంబందము ఉండదు. నీవు నిజానికి ఆత్మవే. కానీ అజ్ఞానంలో మనం సత్యాన్ని మరచిపోయాము. అందుకే దీనిని ఏస్తుక్రీస్తు అంటారు, మీరు అంతా దారి తప్పిన గొర్రెపిల్లలు అని.

పరమాత్మలో ఐక్యం: ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలను తొలగించుకుంటావో అప్పుడు నువ్వు అయిన ఆత్మవు ఈ అనంత సాగరమైన పరమాత్మలో విలీనం అవుతావు.

అయితే నువ్వు నీ శరీరపు కండ్లతో చూసేది కాదు. దానిని (ఆత్మను) చూడాలంటే సాధన (ధ్యానం) చేసి నీ హృదయంలో సాక్షాత్కరించుకోవాలి.అంటే ఆ అనుభూతి నీ మనస్సుకి మాత్రమే తెలుస్తుంది అది వర్ణింపనలవికానిది. అప్పుడు శరీరం ఉన్నపుడే నువ్వు ముక్తుడవు అవుతావు.

-
ఓం నమో పరమాత్మయే నమః

ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :

ఓం నమో పరమాత్మయే నమః

ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :

మిత్రులారా మీ అందరికి నేను ఇంతకూ ముందే ఇప్పుడు మీకు యే గుణాలు కలిగి వున్న సాత్విక గుణాలను అలవరచుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి అని తెలిపినాను. ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు ఇవే .తెలుసుకొని..... పాటించి మిమ్ములను మీరు మార్చుకొని అన్ని దివ్య గుణాలను పాటించి ఆ దేవదేవుడైన నిరాకారుడైన ఆ భాగవతుడిని మీ హృదయాలలో సాక్షాత్కరించుకొని , ఆ పరమపదాన్ని చేరుకోవాలని నా మనవి. ఎంతో ఉత్కృష్టమైన మోక్షానికి చేరుకోవాలి నా విన్నపం. అందువలన ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :

- పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ట
- ఆత్మలో ధృడత
- ఆలోచనలో పరిపక్వత
- మనుస్సులో సంతుష్టత
- బుద్దిలో పరిపక్వత
- సంస్కారములో శ్రేష్టత
- దృష్టిలో పవిత్రత
- మాటలలో మధురత
- కర్మలలో ప్రావీణ్యత
- సేవలో నమ్రత
- వ్యవహారములో సరళత
- స్నేహములో ఆత్మీయత
- ఆహారములో సాత్వికత
- జీవితములో సత్యత
- వ్యక్తిత్వములో రమణీయత
- నిద్రలో నిశ్చింతత


పైన తెలుపబడిన అన్ని గుణాలను మనస్సులో భద్రపరచుకొని ,మీ ఆలోచనలను , బుద్దులను , వ్యవహారశైలిని సంపూర్ణంగా మార్చుకొని వాటిని అన్నిటిని పాటించి సాత్విక గుణాన్ని పాటించి ఆ భగవంతుడైన సర్వేశ్వరుడు పరమాత్మస్వరూపుడిని హృదయంలో సత్సక్షత్కారించుకోండి. మీ మానవ జన్మలను సార్థకత చేసుకోండి. మీ అసలు సిసలు ఆయిన మానవ జన్మ లక్ష్యాన్ని ఈ జన్మలోనే పొందవలసినడదిగా నా మనవి.

కుంకుమ బొట్టు పెట్టడం వెనక ఉన్న ఆంతర్యము ఏమిటి ?

ఓం నమో పరమాత్మయే నమః

కుంకుమ బొట్టు పెట్టడం వెనక ఉన్న ఆంతర్యము ఏమిటి ?
మిత్రులారా! మనం అందరమూ ప్రతి దినము బొట్టు పెట్టు కుంటాము. నిజానికి అది ఎందుకు పెట్టు కుంటున్నామో దాని వెనుక ఉన్న ఆంతర్యము ఏమిటో ఎవరికీ తెలియదు. అందులోను బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమనే ధరిస్తాము. అసలు కుంకుమనే ఎందుకు ధరించాలి అనేది కూడ ఎవరికీ తెలియదు. ఇంకో విషయం ఏమిటంటే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు, బొట్టును నాసికాగ్రము పైభాగాన అంటే రెండు కను బొమ్మల మధ్య (భ్రుటి) లోనే ఎందుకు పెట్టుకుంటామో కూడ చాల మందికి తెలియదు.వీటి అన్నిటికి చాలా వేద అర్థాలు వున్నాయి.
మనం పెట్టుకొనే బొట్టుకు scientific reasons కూడా చాలానే వున్నాయి. వాటిని మన మిత్రులు చాల మంది post  కూడ చేసారు. కాని వీటి అన్నిటికంటే మరీ ముఖ్యంగా ఇందులో ఉన్న వేద అర్థాన్ని మరియు దాని అంతర్యాన్ని తెలిసికోవలసిన బాధ్యత మన అందరి పైన వుంది.
మొదట బొట్టు పెట్టుకునేటప్పుడు మనం కొద్దిగా కుంకుమను తీసుకుంటాము. దానిని మనం పెట్టుకుంటాము. నువ్వు తీసుకున్న కుంకుమ ఎంతయో అంత పరిణామమే నువ్వు అంటే ఆత్మవు అని దాని అర్థము. (దీనినే కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఈ విధంగా చెప్తాడు. అంతరాత్మ అయిన పురుషుడు బొటన వ్రేలంతవాడు సర్వదా ప్రాణుల హృదయాలలో నివసిస్తువుంటాడు). 
కుంకుమనే ఎందుకు ధరించాలి అంటే కుంకుమ ఎర్రని ఎరుపు రంగు. దీని అర్థము నీవు అంటే ఆత్మవు అయిన నీవు ఈ ఎర్రని ఎరుపే (దేదీప్యమానంగా వెలిగే దివ్య జ్యోతి) అని దానిలో ఉన్న నిగూఢ అంతరార్ధము.
బొట్టును నాసికాగ్రము పైభాగాన అంటే రెండు కను బొమ్మల మధ్య (భ్రుటి) లోనే ఎందుకు పెట్టుకుంటాము అంటే నీవు అయిన ఆత్మ నివాస స్థానము అదే అని అర్థము, అంటే మనకు అందరికి వెలుగుతున్న దివ్య జ్యోతి అక్కడ కొలువై వుంటుంది. దీనినే శ్రీ కృష్ణ భగవానుడు 6 వ అధ్యాయం ధ్యాన యోగం లో ఈ విధంగా చెప్తాడు. అర్జునా! చిత్తెంద్రియవ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలిపి మనస్సును ఆత్మయందు స్థిరమొనర్చి ధ్యానించి ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొనిన యెడల యోగి శరీరం ఉండగానే ముక్తుడవుతున్నాడు. ఇదే విషయాన్నీ వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఏకాగ్రతతో మనస్సు నిలిపిన ఓంకారము వినిపించునురా, భ్రూమధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా. ఆ చిదానంద మూర్తిని దర్శించిన ముక్తి నీకు ప్రాప్తించునురా.అని తెలిపినాడు.
మిత్రులారా ఇప్పుడు అందరికి అర్థము అయినదా మనం ప్రతి దినము కుంకుమను ఎందుకు ధరిస్తామో. మిత్రులారా మనం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే ప్రతి పనిలో ఒక అంతరార్ధము వుంటుంది. దానిని తెలుసుకొని ఆచరించండి. అన్ని ఆచరించండి కాని దానిలో అంతరార్ధాన్ని గ్రహించలేకపోతే మీరు మీ పిల్లలకు ఎలా తెలుపుతారు. ఈ విధంగా తెలుసుకోలేకపోతే వాళ్ళు కూడా మన మాదిరే కళ్ళు ఉన్న గుడ్దొల్ల మాదిరి దారి తెన్ను తెలియక వెళ్తుంటారు. కావున అందరూ సూక్ష్మమైన విషయాలను గ్రహించి తెలుసుకొని ఆచరించండి. మీ పిల్లలకు మంచి భవిష్యతును అంటే పరమపదాన్ని చేరే మార్గాన్ని తెలిపండి. ఆ విధంగా తెలిపి వారి జన్మ యొక్క అంతర్యాన్ని వివరించండి.

ఓం నమో పరమాత్మయే నమః 

మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ?

ఓం నమో పరమాత్మయే నమః

మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ?
మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.
ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోరఉపనిషత్తు లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు  అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను  ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది, అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము.
మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు.
ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే.
ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి.
అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.

మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి ?

ఓం నమో పరమాత్మయే నమః

మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి ?
జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి? మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. జన్మ అంటే మళ్ళి పుట్టడం అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కాని మానవ జన్మే అని మాత్రం చెప్పలేము ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది.
అన్ని జన్మలలోనూ మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తువుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.
అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నేత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలచరించే అవకాశం లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలననుభావించి, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని – మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే  కానీ కర్మజేయుటకు సాధనమైన స్థూల శరీరం వుండదు. కనుక భాగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.
ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులయందు జన్మిస్తాడు.ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు.ఈ జన్మలలో కర్మలుచేస్తున్న అవి అన్నియు బుద్దిపరంగా కాదు, అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. ఈ జంతు జన్మలలో శరీరం –మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు.కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భాగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు.
ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ మనవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు మరియు పాప కర్మల ఫలంగా దుఖాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవజన్మలోనే వుంది.ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మనవ జన్మ ఉత్తమోత్తమమైనది మరియు దుర్లభమైనది అని అన్నారు. ఈ మనవ జన్మ 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మనవ జన్మ. కనుకనే ఈ మనవ జన్మను జంతూనాం నారా జన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివేక చూడామణి గ్రంధంలో తెలియజేసారు. ఇట్టి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మనవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. 
సరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే వున్నాయి కాని ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది.పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి? జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తువుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి అన్నది? అంటే మనవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. 
సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి? సాధారణంగా మనం అంతా (మనుషులందరూ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి.అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించిన ఈ మనస్సుకు ఎదో ఒక వెలితి వుంటుంది.దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణవస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? ఆ నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మా మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ అనిత్యమైనవే అని అర్థం.
కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం – ఆనందం అందుకునేవరకు మానవుడికి తృప్తిలేదు. అసంతృప్తి తీరదు. అట్టి శాస్వతానందాన్ని అందుకోవడమే జన్మను సార్ధకం చేసుకోవడమంటే. ఆ శాస్వతానందాన్నే మోక్షం,  ముక్తి అన్నారు.
ఈ సృష్టిలో వున్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం (పరమాత్మునిలో విలీనం అదియే మోక్షం) కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలని సంపూర్ణంగా నిర్మూలించుకొని, అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు వీటి అన్నిటినుండి విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడ అంటారు. దానికి సరియైన జన్మ ఈ ఒక్క మానవ జన్మ మాత్రమే, ఇది యే జన్మలలోనూ సాధ్యం కాదు. జంతు జన్మలలో అయితే మనస్సు మాత్రమే ఉంటాయి వాటికీ బుద్ధి వుండదు. అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి వున్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే. ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు అదియే బుద్ధి. దీని ద్వార శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సత్తు గల దానిని అంటే నాశనం లేనిది ఏది అని గ్రహించి అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి అంటే నేను ఎవరు? ఎందుకు పుట్టాను? ఎవరికోసం రావలసి వచ్చింది? నా లక్ష్యం ఏమిటి? నా ధ్యేయం ఏమిటి? ఈ విధంగా తెలుసుకొని మనస్సును మరియు బుద్దిని అదుపులో వుంచుకొని పరమాత్మా తత్వాన్ని, నిత్య సత్యమైన దానిని సంపుర్ణముగా తెలుసుకొని అదే విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం అని అంటారు. ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని లేకపోతే ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తాడు. ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును పెట్టడు. నువ్వు ప్రయత్నించు దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని.

అంటే మనం అజ్ఞానంలో వుంటూ కర్మలను ఆచరిస్తూ అన్నియు దుష్కర్మలె చేస్తే 10౦% మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు. అన్ని దుష్కర్మలె (చెడ్డ పనులే) చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బందనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఎదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే 99% మానవ జన్మ ఎత్తే అవకాశాలు వున్నాయి. కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బందనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి కొద్దిగలో కొద్దిగా దేవుని గురించి తెలుసుకొని వుంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. (ఈ విషయాన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ధ్యాన యోగంలో చెప్తాడు. అర్జునా! ఎవరు అయితే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని (కర్మ,జ్ఞాన మరియు ధ్యాన) అవలంబించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా ఒకవేళ కర్మలు వుంటే వారికీ ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన కుటుంబంలో వస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం వుండదు అని శ్రీ కృష్ణుడు అర్జునకు వివరిస్తాడు)