My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

నరుడే నారాయణుడు :

ఓం నమో పరమాత్మయే నమః

నరుడే నారాయణుడు :
ఇది నేను చిన్నపుడు విన్నప్పుడు నాకు ఒకటే ఆలోచన. నరుడేంటి నారాయణుడు అవడమేంటి. ఒకటే ఆలోచన. అందులో నాకు చిన్నప్పటి నుండి నారాయణుడు అంటే అమితమైన భక్తీ శ్రద్దలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే ఎన్నో దేవుని కథల పుస్తకాలూ చదివాను మరియు ఎన్నో దేవతల సినిమాలు చూశాను.అందులో ఎక్కడ చుసిన నారాయణుడు వచ్చే కాపాడుతాడు మరల లోక కళ్యాణార్ధం అవతారాలు కూడ ధరిస్తాడు ( ప్రహ్లాద, అన్నమయ్య, గజేంద్ర మోక్షం, దృవుడు మరియు నారదుడు చుస్తే ఎప్పుడు నారాయణ మంత్రం జపిస్తాడు) అంతేగాక నాకు చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు బ్రహ్మ సృష్టి కర్త అని, నారాయణుడు సృష్టి పరిపాలకుడు అని మరియు ఈశ్వరుడు సృష్టిని లయించేవాడని చెప్పేవారు. అందులో నాకు సృష్టి సృష్టించడం గొప్పకాదు దానిని పరిపాలించడం అంటే కత్తి మీద సాము లాంటిది అని నా భావన. అంతేగాక సృష్టించడం అన్న కష్టమేమో కానీ లయించడం చాల సులువైన పనికదా. ఆ విధంగా కూడ నాకు విష్ణుమూర్తి మీద అమితమైన ప్రేమ.
ఇప్పుడు నరుడే నారాయణుడు ఏ విదంగా, ఇందులో వున్న మర్మము ఏంటి అసలు దీని అంతరార్ధము ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. నరుడు అంటే మానవుడు నారాయణుడు అంటే ఆ దేవదేవుడు పరమాత్మా స్వరూపుడు. మానవుడు ఏంటి నారాయణుడు కావడమేంటి? ఎలా?
మానవుడు నిజానికి పరమాత్మా స్వరూపుడు, తను అది యందు పరిపూర్ణుడే, కానీ తను (మానవుడు) చేసే కర్మలను అజ్ఞానంతో అవిద్యతో తానే బాద్యుడిని అనుకోని అంటే అహంకారం ఆవరించి తను తన స్వస్వరుపాన్ని మరచి  ఈ ప్రక్రుతి మాయలో తను బందిగా అయినాడు. అప్పుడు పరమాత్మా స్వరూపుడైన మానవుడు జీవత్మగా మారి ఈ జనన మరణ చట్రంలో చిక్కుకోనిపోయాడు. ఆ విధంగా నరుడు ఈ మాయా ప్రకృతిలో పడిపోయి తన గమ్యాన్ని కూడ మరచిపోయాడు. చివరకు అధోగతి పాలవుతున్నాడు.
నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు. భగవద్గేతలో శ్రీకృష్ణుడు అర్జునకు, ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను  అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యానార్ధంగా, ఫలాశక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా!      
చూసారా! ఇద్దరు శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే (అంటే శక్తినిచ్చే) ఆత్మ కూడ ఒకటే కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం. అందుకే వీరిని నర నారాయణులు అని కూడ అంటారు మీకు తెలుసా.
అంటే అజ్ఞానంలో వుంటే నరుడు, అదే నరుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఆ దేవదేవుని దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో దర్శించి తరించి పరిపూర్ణుడైతే, అదే నరుడే నారాయణుడు అవుతున్నాడు.
కావున మిత్రులారా అంతరార్ధాన్ని గ్రహించి, గ్రహించిన దానిని సంపూర్ణంగా తెలిసికొని ఎత్తిన మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి.

No comments:

Post a Comment