My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

ఆత్మ :

ఓం నమో పరమాత్మయే నమః

ఆత్మ :
ఇంతకు ముందు సృష్టి గురించి మరియు పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఇందులో ఆత్మ గురించి వివరిస్తాను.

ఆత్మకు మరియు పరమాత్మకు ఎటువంటి భేదము లేదు (రెండు ఒక్కటే). అదేలగు అంటే ఒక సముద్రము నుండి ఒక నీటి చుక్కను మనము ప్రక్కకు తీస్తే ఆ నీటి చుక్క సముద్రపు నీటికి ఏ విదముగా సమానమో అదేలగు ఆత్మ కూడ పరమాత్మనే.
సృష్టి జరిగిన తరువాత పంచాభుతలతో నిర్మితమైన ఈ సకల చరాచర జీవులలో ఆత్మ ప్రవేసింపబడింది. ఆత్మ యొక్క శక్తీ చేతనే ఈ పంచాభుతలతో నిర్మితమైన ఈ శరీరాలు మరియు సకల చరాచర జీవులు (అంటే జంతువులూ, పక్షులు, సకల ప్రాణులు) అన్నియు పనిచేయుచున్నవి.

సర్వ ప్రాణులయందు వినబడకుండా, చూడబడకుండా, తెలియబడకుండా వుంటూ సర్వాన్ని వింటూ, చూస్తూ, తెలుసుకుంటూ ఉంటున్నవాడే ఆత్మ.
ప్రతి ఒక్కరి శరీరాలలోను ఆత్మ వుంటుంది. కానీ అది ఏమి చేయదు (అంటే ఉదాహరునకు ఒక ఇంట్లో ఒక దీపం వుంటుంది . దీపం యొక్క కాంతితో ఇంట్లో అన్ని పనులు చేసుకుంటు వుంటాము. కానీ ఆ దీపం చేయదు కదా) ఆత్మ యొక్క శక్తీ చేతనే మన శరీరాలు పని చేయుచున్నవి.
ఇంకో ఉదాహరణ ఏమంటే ఒక కారు వున్నది .కారుకు ఇంజను వున్నది . కారు డ్రైవర్ చేత నడుపబడుచున్నది. కారుకు ఇంజిన్ వుండడం వలన డ్రైవర్ కారు నడుపుతున్నాడు . అదే ఇంజిన్ లేకుంటే కారు వెలుతుందా లేదు కదా అంటే కారు (శరీరం) డ్రైవర్ (మనస్సు) ఇంజిన్(ఆత్మ) . ఇంజిన్ ఆదారంగా డ్రైవర్ కారు నడుపుతున్నాడు అదేలగు ఆత్మ యొక్క శక్తీ చేత మనస్సు ఆదారంగా శరీరము పనిచేసుకోనుచున్నది. 
నైనంఛిన్దన్తిశస్త్రాణి, నైనందహతిపావక :
నచైనంక్లేదయన్త్యాపో, నశోషయతిమారుత: ׀׀                                (భగవద్గీత : 2:23)
ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయను సమర్ధము కాదు.
అచ్చేద్యో యమదాహ్యొ యం అక్లేద్యో శోష్య ఏవ చ |
నిత్య: సర్వగత: స్థాణు: అచలో యం సనాతన: ||                       (భగవద్గీత : 2:24)
(ఇది) చేదించుటకు, దహించుటకు, తడుపుటకు, ఆర్పుటకును సాద్యము కానిది.ఇది ఎల్లప్పుడూ అంతటను వ్యాపించి ఉండునది, చలింపనిది, స్తిరమైనది, శాశ్వతమైనది.
అవ్యక్తో యమచింత్యో యమ్ అవికర్యోయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||                                    (భగవద్గీత : 2:25)
ఈ ఆత్మ వ్యక్తము కానిది, ఊహింపనలవికానిది, వికారములు లేనిదని తెలుసుకో,
ఆశ్చర్యవత్పస్యతి కస్చిదేనం ఆశ్చర్యపద్వాదతి తథైవ చాన్య: |
ఆశ్చర్యవచ్చెనమన్య: శృనోతి శ్రుత్వాప్యేనం వేద నా చైవ కశ్చిత్ ||                    (భగవద్గీత : 2:29)
ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యముగా చూచును. అట్లే ఇంకొకడు దానిని గూర్చి ఆశ్చర్యమైనదిగా పలుకును. మరొకడు ఈ ఆత్మను ఆశ్చర్యముగా వినును. ఇంకొకడు విని కూడా ఈ ఆత్మను తెలుసుకోలేడు.
దేహీ నిత్యమవద్యో యం దేహే సర్వస్వ భారత |
తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుమర్హసి ||                        (భగవద్గీత : 2:౩౦)                           
ప్రతి దేహంలోను వుండే ఆత్మ చంపుటకు వీలుకానిది. కనుక ఏ జీవిని గూర్చియైన శోకింపకు. 
ఆత్మే – బ్రహ్మ (పరమాత్మ):
ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజపతిరేతే సర్వే దేవా ఇమాచి చ పఇచ్చమహాభూతాని
పృథివీ వాయురకాస ఆపో జ్యోతింశీత్యేతాని ఇమాని చక్షుద్రమిశ్రాణీవ| బీజని
ఇతరాణి చేతరాణ చాన్డజాని చ జరుజని చ స్వేదజాని ఛోద్భిజ్జాని చాశ్వ గవ:
పురుషాం హస్తినో యత్కించేదం ప్రాణి జంగమం చ పతత్రి చ యచ్చ స్తావరం సర్వం
తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిస్టితం ప్రజ్ఞానేత్రో లోక: ప్రజ్ఞా ప్రతిష్టా ప్రజ్ఞానం బ్రహ్మ ||                (ఐతరేయోపనిషత్ ౩:౩)

మహాచైతన్యమైన ఆత్మే సృష్టికర్తగాను, ప్రకృతిగాను వున్నది. భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని అనే ఐదు మౌలిక మూలకాలుగా అదే వున్నది. అల్పప్రాణులుగాను, బీజాలుగాను వున్నది అదే. అండాల నుండి పుట్టినవి, గర్భకోశం నుండి పుట్టినవి. స్వేదం నుండి ఉద్భవించినవి. విత్తనాల నుండి మొలకేత్తేవి అన్ని అదే.గుర్రాలు, గోవులు, మనుష్యులు, ఏనుగులు ఇలా వున్నవి అన్నియు ఆత్మే. నడిచేవి, ఎగిరేవి, ఇత్యాది అన్ని ప్రాణులు స్తవర జంగామలు అన్నీ ఆత్మే.సమస్తం ఆత్మ మార్గదర్సకంలో నడుచుకుంటాయి .అన్ని ఆత్మలో నెలకొని వున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించబడుతోంది . సమస్తానికి ఆత్మే ఆధారభూతం. మహాచైత్న పదార్థమైన ఆత్మే బ్రహ్మ (పరమాత్మ).   

No comments:

Post a Comment