My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

జీవుడే దేవుడు :

ఓం నమో పరమాత్మయే నమః

జీవుడే దేవుడు :
జీవుడే దేవుడు. అసలు జీవుడు అంటే ఎవరు ? ఇది నా మదిలో నాకు తొలచిన మొదటి ప్రశ్న. చిన్నప్పుడు నా మదిలో, దేవుడంటే అతనేదో ఒక మానవ రూపము కలవాడు అని అనుకునే వాడిని. ఆ విధంగా దేవుడు అంటే ఒక చిన్న అర్థం అన్నా వుండేది కానీ జీవుడు అంటే ఎవరు అన్నది నా మదిలో రేగిన అలజడి.
ఆ తరువాత ఎన్నో మత గ్రంధాలూ (భగవద్గీత, ఖురాన్, బైబిల్ ) ఇలా ఎన్నో గ్రంధాలూ చదివిన తరువాత నా మనసులో  ఒక్కసారిగా ఎన్నో అలజడులు ఏవేవో సందేహాలు ఎన్నెన్నో అనుమానాలు . అప్పుడు మొదలైంది నాలో అసలు ఆలోచన. వాటిని అన్నిటిని పటించిన తరువాత అందులో ముఖ్యంగా భగవద్గీతలో నాకు కావలసిన దానికి జవాబు దొరికింది. అందులో శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించిన ప్రతి లైన్ నా మనసులో బాణాలలాగా వెళ్లి ఎన్నో సందేహాలను తీర్చింది.
అప్పుడు తెలుసుకున్న అవును నిజమే జీవుడే దేవుడు అదేలగు అంటే జీవుడు అంటే కర్మబంధనాలతో కూడిన ఆత్మ. ఇక్కడ ఈ కర్మ బంధనాలు ఆత్మకు ఏమి అంటవు అవి అన్నియు అజ్ఞానంతో మరియు అవిద్యతో నేను అనే అహంకారంతో నావి అనే స్వార్ధంతో ఏర్పరచుకున్న పొరలు ( అవే కర్మ బంధనాలు) ఈ విధంగా పరిపూర్ణుడైన ఆత్మ స్వరూపుడి చుట్టూ, మనం శరీరం వున్నప్పుడు అహంకారంతో ఏర్పరచుకున్న బంధనాల మూలంగా దైవ స్వరూపులైన మనం జీవులుగా మారుతున్నాము. 

కావున ఇప్పటికైనా గ్రహించండి మీ హృదయ అంతరంలో దేదీప్యమానంగా స్వయం ప్రకాశితమై వెలుగొందుతున్న ఆ దివ్య మంగళ స్వరూపాన్ని సాధన (ధ్యానం) ద్వార మీ అంతరాలలో దర్శించి మీరు అంతా అజ్ఞానంలో అలమటిస్తున్న అహంకారంతో నేను అని వున్నా భావనని సంపూర్ణంగా తొలగించి శాస్వితుడు అయిన నిరాకారమైన ఆ దేవదేవుని స్వస్వరూపాలు అని గ్రహించి మీ జన్మలను ధన్యం చేసుకొని సంపూర్ణంగా ముముక్షువులు కండి. 

No comments:

Post a Comment