My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

మానవుడే మాధవుడు :

ఓం నమో పరమాత్మయే నమః

మానవుడే మాధవుడు :
ఇది చాల చోట్ల విని వుంటాము అంతే కాక చాల చోట్ల రాసి వుంటారు కూడ. కానీ దీని అంతరార్ధాన్ని మాత్రం అంతగా గ్రహించి ఉండము. ఎందుకంటే ఇది చాల చిన్న విషయంగా పరిగనణిస్తాము .
మానవుడే మాధవుడు అంటే ఇందులో చాల వేదాంత రహస్యము వుంది. అది ఏమిటంటే ఈ సమస్తము (అంటే ప్రకృతి) ఆ పరమాత్ముని యొక్క ప్రతిరూపాలు అన్న మాట. అంటే ఈ కంటికి కనిపించే ఈ నశ్వరమైన ప్రపంచము మొత్తము సృష్టి అంతా పరమాత్ముడే అదేలగు అంటే మనం బంగాంరంతో ఏవేవో ఆభరణాలు చేస్తాము అంటే హారాలు, ఉంగరాలు,  కమ్మలు,  వడ్డానం అని ఇలా ఎన్నెన్నో చేస్తాము వాటి అన్నిటిని కరిగిస్తే చివరకు మిగిలేది బంగారమే అలాగే ఈ నస్వర ప్రపంచము మొత్తం చివరకు ఆ శక్తిగానే (పరమాత్మాగానే) మారుతుంది.
మానవుడే మాధవుడు అవును ఇది సత్యం. దేవుడు కరుణామయుడు, ఎంతో దయ కలవాడు, చాల జాలి కలవాడు అన్నిటికి మించి ఎంతో ప్రేమమయుడు. ఎంతగా అంటే నీవు ఏది కోరితే అది నీకు ఖచ్చితంగా ఇస్తాడు అది ఇస్తున్నాడు. అంతటి సత్యవంతుడు ఆ పరమేశ్వరుడు. ఇన్ని దివ్యగుణాలు కలిగివున్నాడు ఆ సర్వేశ్వరుడు. ఆ దేవదేవుని దివ్యగునాలు అన్నియు నీలోను వున్నాయి. నిజానికి ఈ దివ్య గుణాలే నువ్వు. కాని వాటిని అన్నిటిని మనం చెరిపేసి అహంకారంతో అజ్ఞానంతో అవిద్యతో మరీ ముఖ్యంగా స్వార్ధంతో వాటిని అన్నిటిని తొక్కి కాలు క్రింద పెట్టి నేను నా వాళ్ళు అనే ఒకే ఒక్క స్వార్ధ చింతనతో రోజురోజుకు మనుషులందరూ రాక్షషులు కంటే దిగజారిపోతున్నారు.
కావున ఈ సమస్తాన్ని పరమాత్మగా భావించి అందరిలోనూ అంతటను ఆ దేవదేవుడే అని గ్రహించి సేవ చేయడం మొదలుపెట్టు. మతికిపెట్టుకో  నీవు చేసే సేవా ఎప్పటికైన అది నిస్వార్ధంగా వుండాలి ఎంతగా అంటే నీవు కుడి చేత్తో చేసే సేవ నీ ఎడమ చేతికి కూడ తెలియకూడదు అంతగా. నీవు చేసే సేవ ఆ పరమాత్ముడికే అనే సంపూర్ణ భావనను గ్రహించి నేను చేశాను అనే అహంకారాన్ని నీ మనస్సు నుండి సంపూర్ణంగా విసర్జించు. అప్పుడే మానవుడు మాధవుడు అవుతాడు. మాధవుడు అంటే దేవుడు అని అర్థం.
దేవుడైన మనకు ఒక సహాయం చేయాలంటే ఒక మానవ రూపం అంటే పంచభూతలతో నిర్మితమైన ఒక శరీరాన్ని ఏర్పరచుకొని వచ్చే సహాయం చేస్తాడు. అది ఇప్పుడు నీవే  చేసి ఆ దేవదేవుని కృపకు ఆ దేవదేవుని దయకు కృతార్తుడివి కమ్ము.
ఆ విధంగా చేసిన వాళ్ళు మనకు ఎంతో మంది వున్నారు.మదర్ తెరిస్సా, ఈమె ఎక్కడి నుండో వచ్చి ఇక్కడి పిల్లలను తన పిల్లలుగా భావించి సేవించి ఆమె ఈ లోకంలో ఒక చెదరని ముద్ర వేసుకుంది. అంటే ఆమె చేసే సేవ ఆ భగవంతునికి అని సంపూర్ణంగా భావించిందే తప్ప ఇది నా దేశం కాదు నా వాళ్ళు కాదు అని ఆమె భావించలేదు ఆమె భావన ఆమె చేసే సేవ ఆ దేవదేవుడైన ఆ పరమాత్ముడికే అని భావించింది.
అదే విధంగా ఎస్తుక్రీస్తు అయన కూడ ఎంతో మందికి తన కరుణ మరియు అజ్ఞానంలో ఎంతగానో కొట్టుమిట్టాడుతున్న వారికి జ్ఞానబోధ చేసి కృతార్తుడయ్యాడు. అంతటి మహానుభావుడు మనకందరికీ ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పడే తప్ప నేనే దేవుడిని అని ఆయన ఎక్కడ చెప్పలేదు. అంటే ఆయన చేసిన సేవ ఎంతగా అంటే వర్ణింపనలవికాదు అంతగా తాను తన దివ్య వాక్కులతో తన ప్రేమను పంచి ఎంతో మందికి తాను స్వస్తత కూడ చేకుర్చాడు. ఆయన కూడ తానూ చేసిన సేవను ఒక బాధ్యతగా చేసాడు అంటే తాను తన తండ్రి చేతిలో ఒక పనిముట్టుగా అని భావించాడు. ఆయన చేసిన సేవ పరమాత్ముడికే అని భావించాడే తప్ప నేను చేస్తున్నాను అని తను ఎప్పుడు భావించలేదు.
అదేలాగు షిరిడి సాయిబాబా, సాయిబాబా అనే పదం వింటానే మన మనస్సుకు ఒక ఆహ్లాదం ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది కదా. అందరికి దేవుడు ఒక్కడే అని చాటిచెప్పిన మహానుభావుడు ఆ సాయే. సాయిబాబా తన జీవితాన్ని మరియు ఆయన ప్రాణాన్ని కూడ ఆయన అల్లుడుకి ప్రసాదించిన త్యాగమూర్తి ఆ సాయిబాబా. వచ్చిన భక్తులందరి కోర్కెలు తీర్చి వారికందరికీ వారి కనుగుణంగా జ్ఞాన బోధ చేసి కల్పతరువయ్యాడు ఆ సాయి. సాయి ఎంతగా తానూ సేవలు చేసాడంటే, తన చేతిని కాల్చుకొని తన భక్తురాలి బిడ్డను నిప్పుల కొలనులో నుండి కాపాడిన కరుణామయుడు ఆ సాయి. అంటే అయన సేవ చేయడం కోసం తన శరీరాన్ని మరియు తన ప్రాణాన్ని సైతం సమర్పించిన మహానుభావుడు. అంతటి మహానుభావుడు కూడ పరమాత్మునికే నేను సేవ చేస్తున్నానని ఆ దేవదేవుని కృపకు మీరు కూడ పాత్రులు కండి అని చెప్పినాడు.

ఇలా ఎంతో మంది నిస్వార్దంగా లోక కళ్యాణార్ధం సేవలు చేసి వారు అంతా మాధవులుగా ఈ ప్రపంచంలో ఎంతగానో పేరుతెచ్చుకున్నారు. అటువంటి గొప్ప సద్గుణాలు కలవానివే నువ్వు కావున నువ్వు నిస్వార్ధ సేవ చేసి ఆ దేవదేవుడి కృపకు పాత్రుడివి కమ్ము. సేవ మాత్రమే చెయ్యి ఫలితాన్ని ఆశించకు. నీవు చేసే సేవ నిస్వార్ధంగా వున్నప్పుడు మాత్రమే నువ్వు మాధవుడివి అవుతావు. సేవ చేయడం మాత్రం మొదలు పెట్టు అది పరమాత్ముడికే అని సంపూర్ణంగా భావించు.

No comments:

Post a Comment