ఓం నమో
పరమాత్మయే నమః
ప్రతి
ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు :
మిత్రులారా మీ
అందరికి నేను ఇంతకూ ముందే ఇప్పుడు మీకు యే గుణాలు కలిగి వున్న సాత్విక గుణాలను
అలవరచుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి అని తెలిపినాను. ప్రతి ఒక్కరు కలిగి
ఉండవలసిన దివ్య గుణములు ఇవే .తెలుసుకొని..... పాటించి మిమ్ములను మీరు మార్చుకొని
అన్ని దివ్య గుణాలను పాటించి ఆ దేవదేవుడైన నిరాకారుడైన ఆ భాగవతుడిని మీ హృదయాలలో
సాక్షాత్కరించుకొని , ఆ పరమపదాన్ని చేరుకోవాలని నా మనవి. ఎంతో
ఉత్కృష్టమైన మోక్షానికి చేరుకోవాలి నా విన్నపం. అందువలన ప్రతి ఒక్కరు కలిగి
ఉండవలసిన దివ్య గుణములు :
- పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ట
- ఆత్మలో ధృడత
- ఆలోచనలో పరిపక్వత
- మనుస్సులో సంతుష్టత
- బుద్దిలో పరిపక్వత
- సంస్కారములో శ్రేష్టత
- దృష్టిలో పవిత్రత
- మాటలలో మధురత
- కర్మలలో ప్రావీణ్యత
- సేవలో నమ్రత
- వ్యవహారములో సరళత
- స్నేహములో ఆత్మీయత
- ఆహారములో సాత్వికత
- జీవితములో సత్యత
- వ్యక్తిత్వములో రమణీయత
- నిద్రలో నిశ్చింతత
పైన తెలుపబడిన
అన్ని గుణాలను మనస్సులో భద్రపరచుకొని ,మీ ఆలోచనలను ,
బుద్దులను , వ్యవహారశైలిని
సంపూర్ణంగా మార్చుకొని వాటిని అన్నిటిని పాటించి సాత్విక గుణాన్ని పాటించి ఆ
భగవంతుడైన సర్వేశ్వరుడు పరమాత్మస్వరూపుడిని హృదయంలో సత్సక్షత్కారించుకోండి. మీ
మానవ జన్మలను సార్థకత చేసుకోండి. మీ అసలు సిసలు ఆయిన మానవ జన్మ లక్ష్యాన్ని ఈ
జన్మలోనే పొందవలసినడదిగా నా మనవి.
No comments:
Post a Comment