My Blog List

My Blog List

Wednesday, November 20, 2013

విద్య మరియు అవిద్య అంటే ఏమిటి ?

ఓం నమో పరమాత్మయే నమః

విద్య మరియు అవిద్య అంటే ఏమిటి ?
విద్య మరియు అవిద్య లను కొన్ని చోట్ల పరావిద్య అని అపరావిద్య అని కూడ అంటారు. విద్య అంటే చాలా  మంది మనం చదువుకున్న చదువులు అని అనుకుంటారు. మనం చదువుకున్నది కూడా విద్యే కాని ఇది నీ శరీరం కడుపుకు అన్నం పెట్టడానికి ఉపయోగపడుతుంది అందుకే పెద్దలు అంటారు కోటి విద్యలు కూటి కోసం అని. కానీ ఈ చదువులు అన్నియు అవిద్యలే అంటే ఇవి అన్ని అసలైన విద్యలు కాదు. ఇవే కాకా వేదాలలో కూడ చాల విద్యలు ఉన్నాయి కాని వీటిలో కూడ భగవంతుని గురించి తెలిపే ఉపనిషత్తులు మరియు ఆ దేవదేవుని గురించి వివరించిన వాటిని మాత్రమే విద్య అని అంటారు మిగిలిన వాటిని అన్నింటిని అవిద్య అని అంటారు.
విద్య అంటే దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలిసికోవలసినది ఏమి ఉండదో; దేనిని తెలిసికుంటే సర్వమూ తెలిసినట్లో అట్టి జ్ఞానాన్ని – ఆత్మ జ్ఞానాన్ని – నేను ఆత్మను అనే జ్ఞానాన్ని మరియు భగవంతుని గురించి, భగవంతుని స్వస్వరూపం గురించి, నీ స్వస్వరూపం గురించి మరియు ఈ ప్రకృతి యొక్క కర్త, కర్మ మరియు క్రియ ఎవరు అన్న విచక్షణ జ్ఞానాన్ని మరియు ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే విద్య అని అంటారు. అంతే తప్ప మనం చదువుకున్న విద్యలు అన్ని విద్యలు కాదు. అంటే బ్రహ్మ (పరమాత్మా) తత్వం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటిని మాత్రమే విద్యలు అని అంటారు. దీనినే బ్రహ్మవిద్య అని కూడ అంటారు. ఎందుకంటే దేని సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదట దీనిని దివ్య వాణిగా విన్నాడు. బ్రహ్మదేవుడు మొదటగా విని ఇతరులకు బోధించటం వలన దీనిని బ్రహ్మవిద్య అన్నారు.

కనుక మానవుడు తరించాలంటే, తన జన్మను సార్ధకం చేసుకోవాలంటే, జీవిత పరమార్ధమైన మోక్షాన్ని పొందాలంటే  తెలిసికోవాల్సింది మరియు తప్పక అభ్యసించాల్సినది ఆ దేవదేవుని దివ్య జ్ఞానం దానినే విద్య అని అంటారు. మిగిలినవి అన్నియు అవిద్యలే.

No comments:

Post a Comment