My Blog List

My Blog List

Tuesday, December 3, 2013

పతంజలి యోగసూత్రాలు : రెండవ అధ్యాయం

ఓం నమో పరమాత్మయే నమః
సాధన పాదం ఏకాగ్రత : దాని అభ్యాసం.
మొదటి అధ్యాయంలో వివరించబడిన సాధనాలు చాలా శ్రద్దగా, సహనంతో సాధన చేయాలి.దానికి క్రియా యోగం తొలిమెట్టు. తపస్సు, స్వాధ్యాయం (ప్రణవజపం), అంటే మోక్షమునకు దరి చూపించే సద్గ్రంద పటణం మరియు ఈశ్వర ప్రాణిదానం అంటే, మన కర్మలయొక్క ఫలితం ఏదైనా (మంచిగాని, చెడుగాని), భగవంతునికే అర్పించటం అంటే. ఏ ఫలితం వచ్చినా ఉద్రేకపడక సమభావంతో స్వీకరించటం.ఈ మూడు క్రియ యోగం.
క్రియయోగం అవిద్య మొదలైన క్లేశాలను క్షీణింప చేసి, చిత్తమును ఏకాగ్రం చేసి సమాధి సిద్ధింప చేస్తుంది. నిరంతరం క్రియయోగం సాధన చేయటం వలన మనోనిగ్రహం కలిగి, తద్వారా సమాధిసిద్దిస్తుంది.
అవిద్య, అస్మిత(అహంకారం), రాగం, ద్వేషం, అభ్నివేశం (ప్రాణంపై మక్కువ) అనే ఐదు క్లేశాలు ఉన్నాయి. పురుషుడు సహజంగా ఆనంద స్వరూపుడు, అవిద్య అంటే అజ్ఞానం, అహంకారం, రాగం,ద్వేషం,ప్రాణంపై తీపి, ఈ క్లేశాలన్ని మనకి సంసారబంధాన్ని కల్పించి దుఃఖానికి కారణాలు అవుతున్నాయి.
అవిద్య అంటే, అనిత్యమైన వాటిని నిత్యంగా, ఆశుద్దాలను శుద్దంగా, దుఃఖ కారణాలను సుఖాత్మకంగా, అనాత్మలను ఆత్మలుగా భావించటమే. శరీరమే ణు అని మనం భావిస్తాము. అనిత్యమైన ఈ ప్రపంచమే నిత్యమను కొంటాం. దుఃఖ కారణాలైన ఐహిక సుఖాలలో ఆనందం ఉండను కొంటాము. సచ్చిదానంద స్వరూపమమైన ఆత్మను గురించి తలచకుండా అనాత్మలను (శరీరాన్ని) నేనుగా భావిస్తాను. ఇదంతా అవిధ్యయే.
ధ్యానం ద్వార వృత్తుల వికారాలను నిరాకరించాలి. ధ్యానసాధన చేత క్షీణింపబదిన క్లేశములను, దగ్ద బీజములగా చేయవచ్చును.చిత్తవృత్తులను నిగ్రహించటానికి గొప్ప సాధనమే ధ్యానం. ధ్యానాన్ని క్రమం తప్పకుండ శ్రద్దగా చేస్తే, రాగద్వేషాలు స్వాదీనం లోకి వస్తాయి.
పైన చెప్పబడిన క్లేశాలు కర్మలాకు మూలకారణం. మనకు కనిపించే ఈ జన్మలో గాని కనిపించని జన్మంతరాలలో కానీ కర్మను భావాలకి కారణం అవుతాయి. పుణ్యపాప కర్మల వలన సుఖదుఃఖ ఫలాలు కలుగుతున్నాయి. మన సుఖదుఃఖ అనుభవాలకు హేతువు మనం చేసిన పుణ్య పాప కర్మలే.
కర్మలు మూడు రకాలు. అవి సంచిత(గత జన్మలలో గతించిన కర్మ) ,ప్రారబ్ద(ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది) మరియు ఆగామి (రాబోయే జన్మలలో ఫలించబోయేది).మనం ఆగామి కర్మను మాత్రం నిరోదించగలం. ప్రయత్నంతో నిర్జించాలి.  {మొత్తం కర్మల గురించి వాటి వివరణ అన్నియు కర్మలు మరియు కర్మలు-II లో చెప్పబడినవి).
ప్రకాశం, క్రియ, స్తితి అనేవాటిని స్వభావంగా కలిగి ఉన్నదే దృశ్యం. అంతే కాకుండా పంచభూతాలు, ఇంద్రియాలతో కుడి వుంది, పురుషునికి భోగ,మోక్షలను ప్రయోజనంగా గలిగించినదే దృశ్యం.
ప్రకృతి, పంచాభూతాలతో, మనసు, ఇంద్రియాలతో గూడి త్రిగునాత్మకమయి వుంది. సత్వం వలన ప్రకాశం, రజోగుణం వలన ప్రవ్రుత్తి మరియు తమో గుణం వలన స్తితి కలుగుతుంటాయి.పుశునికి అనుభవాన్ని కుర్చటమే ఈ ప్రకృతి యొక్క ప్రయోజనం.
 ప్రకృతికి అధీనులు కాకుండా ఉండటమే యోగానికి ప్రధానాశయం. బాహ్యంతర ప్రక్రుతులను నిరోధించటం కోసం కర్మ ఉపాసన యోగ, జ్ఞాన మార్గాలు అవలంభించి ముక్తులు కావాలి.అంతర ప్రకృతిని ఆత్మ సంయమనంతో అంటే ధ్యాన యోగం ద్వార జయించాలి . అలా జయించగలిగిన వాడు, ప్రపంచాన్నంత జయించగలుగుతాడు.
ఎప్పుడైతే మనసు ఆత్మలో తాదాత్మ్యం చెందుతుందో (అది ధ్యాన యోగంలో), ఈ స్తితిని పొందటం వలన యోగి భ్రాంతి రహితుడై, సర్వదుఃఖాతీతుడై, ప్రశాంతచిత్తుడై ఒప్పుతూ, తనే పరిపూర్ణుడనని, సర్వ శక్తి మంతుడనని గ్రహిస్తాడు.
యోగంలో వివిధ అంగాలను అనుస్టించటం వలన చిత్తమాలిన్యాలు తొలగి, వివేకఖ్యాతి కలుగుతుంది.
సహజంగా శరీరానికి వుండే చలనాన్ని నిరోదించటం వలన, అనంతం గురించి, ధ్యానం చేయటం వలన ఆసనం స్తిరమౌతుంది, సుఖకరం అవుతుంది.స్తిరంగా సుఖంగా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేదే ఆసనము. యోగ సాధనకు అటువంటి సుఖసనము చాల అవసరము.అటువంటి ఆసనంలో శరీరం స్తిరంగా వుండగల్గితే శరీరంలో నాడులపై ఎటువంటి వత్తిడి కలుగదు. అప్పుడు చిత్తఏకాగ్రత సులభంగా పొందవచ్చును.
ఆసనం సిద్దించిన తరువాత, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం కూడ సిద్దిస్తుంది. సాధారణంగా ప్రాణం అంటే శ్వాస అనుకొంటారు. కానీ సమస్త విశ్వంలోని సాముదాయక శక్తే ప్రాణం. ఇదేశక్తి ప్రతిశరీరంలోని ఉపిరితిత్తులలో చలనాన్ని కలిగించి తద్వారా ఉచ్ఛ్వాస, నిశ్వాస పరంపరని కల్గిస్తుంది. ప్రాణశక్తి వశం కావాలంటే శ్వాసను వశం చేసుకోవాలి. 
ప్రాణాయామం వలన చిత్తప్రకాశానికి వున్న ఆవరణ తొలగి పోతుంది. చిత్తానికి వున్న వివిధ ఆవరణలు క్షీణించి పోతే కానీ శుద్ధ తత్వాన్ని పొందదు. ప్రాణాయామం చేయగా చేయగా ఈ ఆవరణాలు క్షీణించి నిర్గుణ చిదానంద తత్వాన్ని పొందుతుంది.

పైన చెప్పినట్లుగా ఆవరణ తొలగిపోయిన తరువాత మనసు ఏకాగ్రత గల్గి, ధారణ చేయటానికి యోగ్యమవుతుంది. ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి చిత్తస్వరుపాన్ని పొందటమే ప్రత్యాహారం.

No comments:

Post a Comment