My Blog List

My Blog List

Tuesday, December 3, 2013

పతంజలి యోగసూత్రాలు : మొదటి అధ్యాయం

ఓం నమో పరమాత్మయే నమః
సమాధి పాదం ఏకాగ్రత : దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు.
ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాల్గింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. ఇవన్ని ఒక విధంగా చిత్తం చేసే వేరు వేరు పనులే. చిత్తంలోని సంకల్పాలనే వ్రుతులు అంటారు. నువ్వే అసలు చైతన్యం. చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే. దాని ద్వార ప్రపంచాన్ని గ్రహిస్తావు. ఒక రాయిని నీటిలో వేస్తే నీటిపై తరంగాలు వస్తాయి. అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే చిత్తంలో ప్రతిక్రియ కలుగుతుంది.నిజంగా, ప్రపంచమంటే, బాహ్య విషయాలలో చిత్తం చేసే ప్రతిక్రియలే.
మనసు తన సహజ శుద్ధావస్థను చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. కానీ ఇంద్రియాలు మాత్రం మనసును బయటకు లాగుతూ ఉంటాయి. మనసు ఇలా ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళకుండా నిరోధించటమే మనోనిగ్రహం. మనసును నిగ్రహించి, ఆత్మలో లయం చేయటానికి, అంతర్ముఖం చేయవలసి వుంటుంది. ఇదే యోగం అంటే.
నదిలో నీరు నిర్మలంగా, ఏవిధమైన కదలికలు లేకుండా, అలలు లేకుండా వున్న సమయంలో అడుగుభాగం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిదంగా మనసులో ఏవిధమైన సంకల్పాలు, ఆలోచనలు లేనప్పుడు మనం మన అంతఃస్వరూపాన్ని కనుగొన గల్గుతాము. మనసు పూర్తిగా మాయమైనప్పుడు మనం ఆత్మ స్వరుపులుగా మిగిలిపోతాము.
ఇతర సమయాలలో అంటే పైన చెప్పినట్లు యోగాస్తితిలో లేనప్పుడు పురుషుడు తన వృత్తులతో తాదాత్మ్యం చెంది ఆయా వృత్తుల రూపాన్ని పొంది వుంటాడు. ఎలాగంటే ఎవరైనా నన్ను బాధపెట్టారను కోండి. దాని వలన నా మనసులో ఒక వ్రుత్తి కలుగుతుంది. ఆ వృత్తిలో నేను తాదాత్మ్యం చెంది, ఆ కారణంగా దుంఖాన్ని పొందుతాను. 
వృత్తులు ఐదు రకాలుగా ఉంటాయి. అవి కొన్ని క్లేశయుక్తాలు, కొన్ని క్లేశరహితాలు.ప్రమాణం, విపర్యం, వికల్పం, నిద్ర మరియు స్మృతి అనే ఐదింటిని వ్రుత్తులు అంటారు.
ప్రమాణం: ii.మనకు కలిగే అనుభవంలో భ్రమ లేకుండా వుంటే, అది ప్రత్యక్ష ప్రమాణం. Ii. లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించగల్గితే అది అనుమాన ప్రమాణం.ఉదాహరునకు పొగను చుచునపుడు నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. Iii. అత్మసాక్షత్కారాన్ని పొందిన యోగుల ప్రత్యక్షానుభావాలే ఆప్తవాక్యంగా ప్రమాణమవుతున్నాయి.ఆగమాలు, శ్రుతులు, స్మృతులు వారి ద్వారానే వస్తున్నాయి. అటువంటి వేదశాస్త్రాలు మనకు వేదం ప్రమాణాలు.
విపర్యం : లేని వస్తువు రూపంలో ఒక వస్తువు గోచరిస్తే ఆ మిధ్యాజ్ఞానమే విపర్యయ వ్రుత్తి. ముత్యపు చిప్పలో మెరుపును చూసి, అది వెండి అనుకుంటే, అదే విపర్యయ వ్రుత్తి.
వికల్పం : శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్దజ్ఞానంతో అనుసరించే వ్రుత్తి అంటే ఏదైనా ఒక శబ్దాన్ని వినిపించగానే, ఆ శబ్దర్ధాన్ని విచారించకుండా, మనోదౌర్బల్యంతో లేని వస్తువుని నిర్ధరించటమే వికల్పవ్రుత్తి. ఉదాహరున గోడ్రాలి కుమారుడు.
నిద్ర : నిద్రించే సమయంలో చిత్తంలో ఎటువంటి వృత్తులు లేకపోతే, అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు ఏవి కలగవు. అనుభవాలు కలగనపుడు, వాటిని స్మరించే ప్రసక్తి వుండదు. కానీ నిద్రించాను అనే స్మృతి మనకు అనుభవంలో కలుగుతోంది కనుక నిద్రావస్థలో కూడ చిత్తంలో వృత్తులు వుండటం నిజం. కనుక నిద్ర కూడా ఒక వ్రుత్తి.
స్మృతి : మనం అనుభవించిన విషయాలు గుర్తు రావటమే స్మృతి అనబడే వ్రుత్తి. ప్రత్యక్షానుభవం, మిధ్యాజ్ఞానం, వికల్పం, నిద్ర అనబడే వృత్తుల ద్వార స్మృతి కలుగవచ్చును. జగ్రుత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వప్నంగా రూపుదాల్చుతుంది.
పై వ్రుత్తులన్నింటిని అభ్యాసం, వైరాగ్యం ద్వార నిగ్రహించవచ్చును. అభ్యాసం అంటే సాధన. వైరాగ్యం అంటే ఏ విషయాలయందు ఆశ, రాగం లేక పోవటమే. పైన చెప్పబడిన వ్రుత్తులన్నింటిని నిరోదించాలంటే అది అభ్యాసం మరియు వైరాగ్యం వలననే సాధ్యం అవుతుంది. సాధనద్వారా సద్వర్తన అలవరచుకొని, సత్సీలం పొందవచ్చును.      
ఆ సాధనని, ఆ అభ్యాసాన్ని చాల కాలం శ్రద్దతో కొనసాగిస్తే, అప్పుడు స్తిరమైన స్తితి కలుగుతుంది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన సాధించలేము. శ్రద్ద, బ్రహ్మచర్యము, తపసు మొదలైన సత్కార్యములతో ఆ సాధన చేయాలి. వైరాగ్యం రెండు రకాలు.. i.అపర వైరాగ్యం ii.పర వైరాగ్యం.
అపర వైరాగ్యం : ఇహలోకంలో చూడబడినవియు, వేదముల ద్వార వినబదినవియు అయిన భోగావిషయములయందు ఆసక్తి లేని చిత్తమునకు కలుగు వశీకార సంజ్ఞ అనే వైరాగ్యం.ప్రాపంచిక విషయాలలో ఆశ, అనురక్తి లేకుండా, వాటికీ వశం కాకుండా, వాటినే తన వశంలో వుంచుకోగల్గటమే వైరాగ్యం. అటువంటి మనోబలం, వైరాగ్యం, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.    
పరావైరాగ్యం : పరావైరాగ్యం అత్యున్నతమైనది. అపర వైరాగ్యవంతునికి గుణములు వేరు, పురుషుడు వేరు అనే దృడమైన వివేకజ్ఞానం కలుగుతుంది. ఇది కలిగిన వణికి ఇంతవరకు ఉపకరనములుగా వున్న గుణముల విషయము నందు కూడా వైరాగ్యం కలుగుతుంది.చిత్తము వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానమందు కూడా వైరాగ్యం కలుగుతుంది. ఇదియే పరావైరాగ్యం.ఇట్టి ధ్రుడమైన వివేకము కలిగిన వణికి భోగావిషయములయందేకాక, వివేకఖ్యాతినందు కూడా వైరాగ్యము కలుగును. జ్ఞానము యొక్క ఈ అత్యున్నత స్తితియే పరావైరాగ్యం.
సమాధి రెండు విధాలు : i.సంప్రజ్ఞాత సమాధి ii. అసంప్రజ్ఞాత సమాధి.
సంప్రజ్ఞాత సమాధి : సంప్రజ్ఞాత సమాధి వలన ప్రకృతిని వశపరచుకోవటానికి కావలసిన శక్తులన్నీ లభిస్తాయి.సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు. సర్వసిద్దులు పొందిన యోగి పతనం కావచ్చును. సంప్రజ్ఞాత సమాధిలో నేను అనే జ్ఞానం ఇంకభాసిస్తూ వుంటుంది. సంస్కార బీజాలు ఉంటాయి.
అవ్యక్త సంస్కారం మాత్రమే చిత్తంలో శేషించి, చిత్తవృత్తుల నన్నింటిని నిరాకరించే సమాధి నిరంతరాభ్యాసం వలన లభిస్తుంది. దీనినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు.ఇది ఇంద్రియాతీతమైన జ్ఞానవ్యవస్థ. దీనివలన మాత్రమే మోక్షం లభిస్తుంది.
ఆస్తిక్య బుద్దితో యోగాన్ని సాధించవలననే ఉత్కంటను శ్రద్ద అంటారు. అటువంటి శ్రద్ద గలవారు ఎన్నో ఆటంకాలను అధిగమించగలుగుతారు. శ్రద్దవలన వీర్యము, అంటే వివేకము గుర్చిన ధారణ (ఉత్సాహము), తద్వారా స్మృతి అంటే ధ్యానము కలుగును. ధ్యానము వలన సమాధి , సమాధి వలన ప్రజ్ఞ అంటే తత్వసక్షాత్కారము కలుగును. ఇదియే ప్రజ్ఞ. తీవ్ర కార్యదీక్ష ఉన్నవారికి ఫలితం త్వరితంగా లభిస్తుంది.అతి తీవ్ర సంవేగులకు చాల త్వరితంగాను యోగము సిద్దిస్తుంది.
కర్మఫలాలను ఎస్వరునుకి సమర్పించటం ద్వార కూడా యోగం సిద్దిస్తుంది. భక్తితో ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు, అతనిపై చిత్తము నిలుపుట ద్వార కూడా యోగాసిద్ది లభించును.
సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా వుంటుంది. అత్యదికమైన జ్ఞానం (నిరతిశయంగా) ఒక్క ఈశ్వరునిలో మాత్రమే వుంటుంది. కాలము చేత భాదింపబడనివాడు అంటే కాలాతీతుడు కావటం చేత, అతడు సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. అతడే అఖండ జ్ఞానస్వరుపుడైన భగవంతుడు. అతడు కాలము చేత కొలవబడనివాడు.
శారీరక రోగం, మానసిక జడత్వం, సంశయం, అజాగ్రత్త మత్తత, అసంతృప్తి, భ్రమ, చిత్తస్తైర్యం నిలువకున్దుట అనేవి యోగానికి అంతరాయాలు.దుఃఖ0, చిత్తక్షోభం, శరీరకంపనం, క్రమరహితశ్వాస అన్నవి చివిక్షేపనికి తోబుట్టువులు వంటివి. చిత్తం శాంతిగా లేనప్పుడు శరీరం కంపించటం, శ్వాస క్రమరహితంగా జరగటం, దుఃఖ0 కలగటం జరుగుతుంటాయి.
అటువంటి చిత్తక్షోభని, చంచల్యాన్ని నివారించటానికి, ఎకతత్వాన్ని అభ్యసించాలి. అంటే క్రమం తప్పకుండ కొంతకాలం మనసునొకే విషయంపై (అంటే హృదయంలో జ్యోతి వుందని) నిలిపి ధ్యానం చేయాలి.
నిరంతర ధ్యానం వలన యోగి చిత్తంలో ధ్యేయం తప్ప మిగిలిన వృత్తులు క్షీణించి ఆచిట్ట్టం ఆత్మ లేక పురుషునిలో తాదాత్మ్యం పొందుతుంది.ఈ విధముగ గ్రహీత్రాదులపై నిలిచినా చిత్తము తదాకారము పొందుటయే సమాపత్తి. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందుటయే సంప్రజ్ఞాత సమాధి ఫలము.
స్మృతి పరిశుద్దమగుచు రాగా ధ్యాన భూమిక శబ్ద, అర్ద, జ్ఞానములు పురుషుడు సంపూర్ణముగా తెలిసికోనుచున్నాడు.
పై సూత్రంలోని శబ్ధర్ధజ్ఞాన మిశ్రమ సవితర్కధ్యాన సాధన వలన, ఈ మూడు కలియని నిర్వితర్క సమాధి స్తితి లభిస్తుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే, సమస్త వృత్తులకు ఆశ్రమమైన స్మృతి పరిశుద్దమౌతుంది. అప్పుడు శబ్దార్ధజ్ఞానా లను వేరు వేరుగా గ్రహింపగలం. దీనినే నిర్వికల్ప సమాధి అంటారు.
నిర్విచార సమాధి వలన ఆధ్యాత్మ ప్రసాదమైన స్టిరా చిత్తం కలుగుతుంది.నిర్విచార సమాధి యందలి ప్రజ్ఞ సత్యపరిపూర్ణమైనది. ఈ స్తితిని అందుకొనిన యోగి పొందెడి ప్రజ్ఞాయే ఋతంభర (kinetic energy) సత్యము (static energy)సృష్టికి మూలము, మరియు అచలము. ఋతము చలింపచేసే శక్తి. 
నిర్విచార సమాధి సాధన చిరకాలం కొనసాగిస్తే సమస్త వృత్తులకు ఆశ్రయమైన స్మృతి శుద్దమవుతుంది.ఈ సమాధి వలన కలిగే సంస్కారం అంటే ప్రజ్ఞా విశారదత్వము, ఋతుంభరత్వము ఇతర సంస్కరములు అన్నింటిని నిగ్రహిస్తాయి. చిత్తాన్ని ఏకాగ్రం చేయటాన్ని ప్రయత్నం ప్రారంభించగానే, చిత్త వృత్తులు విజ్రుంభిస్తాయి.ఏకాగ్రతని లభించనీయవు. కానీ పైన చెప్పిన సాధన వలన చిత్త ఏకాగ్రత పెరిగి, తద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలను నిరోదించ గల్గేంత ప్రబలంగా ఉంటాయి.  

ఋతంభర ప్రగ్నవలన ఇతర ప్రకృతి జన్యములైన సంస్కరములన్ని నిరోదింపబడును. ఇతర సంస్కారాలను నిరోదించే ఈ సంస్కారాన్ని కూడా నిరోదించటం వలన సర్వం నిరోదితమై నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. 

No comments:

Post a Comment