My Blog List

My Blog List

Tuesday, December 3, 2013

పతంజలి యోగసూత్రాలు : నాలుగవ అధ్యాయం

ఓం నమో పరమాత్మయే నమః
కైవల్య పాదం :
(మూడవ పాదం విభూది పాదం. ఇది తెలుసుకుంటే మంచిదే కానీ, వాటిని అనుకరిస్తే మనషి మరల అధోపాతానికి పోయే అవకాశాలు వున్నాయి. అందువలన అది మన లక్ష్యానిని దూరం చేయవచ్చును. అందువలన అది ఇక్కడ వివరింపబడలేదు).
కొందరు జన్మతః అంటే, పుట్టుకతోనే సిద్దపురుషులై వుంటారు. ఆ సిద్దులు వారు పూర్వజన్మలో వారి సాధన ఫలితాలు. నైతిక, మానసిక మరియు ఆద్యాత్మిక విషయాల్లో ఎదైనాసరే సమాధి వలన ప్రాప్తిస్తుంది.
మరొక జాతిగా పరిణమించుట అన్నది ప్రకృతి పరణామ సమప్తివల్ల కలుగుతుంది. జాతిలో మార్పుకల్గుట ప్రకృతి వలన కల్గును. ప్రకృతియే మార్పు చెంది, ఇన్ని రూపములను కన్పించుచుండెను. ఆకాశము నుండి వాయువు పుట్టుట మార్పు ఖనిజములు, వ్రుక్షత్వము, జంతుత్వము, నరత్వము చెందుట కూడా అట్టిదే.
సత్కర్మలు, దుష్కర్మలు స్వయంగా ప్రకృతి మార్పులకు కారణాలు కాజాలవు. అయితే అవి ప్రకృతి మార్పుల ఆటంకాలను తొలగిస్తాయి. మనిషిలో సర్వ శక్తులు వున్నాయి. పరిపూర్ణత మనిషి స్వభావం. ఇది సహజంగా వ్యక్తం కాకుండా మనమే బంధించి ఉంచాము. ఈ బంధనాలను తొలగిస్తే చాలు. ప్రక్రుతిశక్తులు మనలోకి ప్రవేసిస్తాయి.ప్రకృతి ప్రేరణ వలెననే మనం మోక్షమార్గంలో చర్చిస్తున్నాం.సహజమైన, జన్మ స్వతంత్రయమై వున్న కైవల్యాన్ని పొందటానికి గల అడ్డంకులను తొలగించటానికే మన ఈ సాధనాలన్నీ.
యోగి నిర్మించిన చిత్తాలు అస్మిత(అహంకారం) వలననే కలుగుతాయి. ఆత్మ స్వయంగా ఎన్నడు వికారం పొందదు. మనిషి ఏ విధమైన కర్మ చేసిన సహజ ఆత్మ ప్రభావాన్ని ఎన్నడు నష్టం చేయలేవు. అవిద్యావరణం ఆత్మ పరిపూర్ణతను మరుగు పరుస్తుందే కానీ ఆత్మకు వికారం కల్గించలేదు. దుష్కర్మలు ఆత్మ స్వభావాన్ని వ్యక్తం కాకుండా చేస్తే, సత్కర్మలు ఈ ప్రతిబందకాన్ని తొలగిస్తాయి.
యోగి కాగానే ఆ జ్ఞానం తిరిగి స్పురిస్తుంది. మనసు ఒక వస్తువు, ప్రకృతి మరొక వస్తువు కాదు. అవి రెండు భిన్నస్తితులు అని తెలుసుకుంటాడు.
వివిధ చిత్తాలన్నిటిలో సమాధి నిర్మిత చిత్తం కర్మవాసనారహితమైనది. సమస్త చిత్తాల్లో సమాధిస్తితి పొందిన చిత్తం అత్యుత్తమం. యోగంతో సమాధిస్తితి పొందిన వ్యక్తీ సంపూర్ణంగా వాంచారహితుడవుతాడు.           
యోగులు కాని వారికీ కర్మలు, తెలుపు, నలుపు మిశ్రమం అని మూడు రకాలుగా ఉంటాయి. యోగి సంపూర్ణుడైతే, అతను చేసే కర్మలు, వాటి ఫలాలు అతన్ని బంధించలేవు. ఎందువలన అంటే, అతను కర్మలను కోరిచేయడు. ఫలవా0చరహితంగా అతడు తన కర్మలను లోకకల్యాణం కోసం చేస్తుండటం వలన అవి అతనిని అంటవు.
చిత్తానికి అధిపతి అయిన పురుషునికి పరిణామం లేనందువలన, చిత్తవ్రుత్తులు నిరంతరం తెలుస్తున్నాయి. చలింపని వస్తువు ఒకటి వుంటే తప్ప చలించే వస్తువు యొక్క చలనాన్ని కనుక్కోలేము. నిర్వికార, నిర్మల, నిత్య,శుద్ధ పురుషుడు ఎన్నటికి మార్పు చెందకుండా స్తిరంగా ఉన్నాడు. మనః ప్రక్రుతులు రెండు మరిపోతువుంటాయి. కాబట్టి మనసుకన్న తక్కువ వేగం ఉన్నదోకటి, దానికంటే, ఇంకా తక్కువ వేగం వున్నదొకటి, పోను,పోను ఎన్నటికి మర్పుచేందని నిత్య శుద్ధ పురుషుని కనుగొని ఈ పరంపరని సమాప్తి చేయాలి.
ఆ చిత్తం పురుషునికి దృశ్య విషయమై వుండటం వలన స్వయం ప్రకాశకం కాదు.ప్రకృతిలో అంతటా అద్భుతశక్తి వ్యక్తమవుతున్నా, ఆ శక్తి స్వయం ప్రకాశకం కాదు.కానీ అదియే (పురుషుడు) స్వయం ప్రకాశకుడై, సమస్త ప్రకృతిని భాసింప చేయుచున్నాడు.
జ్ఞాన స్వరూపం (పురుషుడు) నిర్వికారమై ఉండటం వలన,చిత్తం పురుషుని స్వరూపాన్ని పొందినపుడు జ్ఞానవంత మవుతుంది. జ్ఞానం అనేది పురుషుని గుణం కాదు. చిత్తం పురుషుని సాన్నిద్యం పొందగానే పురుషుడు చిత్తం మీద ప్రతిఫలిస్తాడు. అందువలన చిత్తం తత్కలితంగా జ్ఞానవంతమై , తానె పురుషుడి వున్నట్లు కనిపిస్తుంది. 
వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తం పుర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతుంది. యోగాభ్యాసం చేయటం వలన నిర్మలమైన ద్రుష్టి అనబడే వివేకం కలుగుతుంది. అలా వివేకం కలిగినపుడు మన కండ్లకు కప్పిన మాయ కరిగిపోతుంది. అప్పుడు వస్తుతత్వం వివరంగా అర్థం అవుతుంది. ప్రకృతి అనేది సంయోగం వలన ఏర్పడుతుందని, సాక్షి పురుషునికోసం, చిత్ర, విచిత్ర ప్రదర్శనలు చూపుతుందని,ప్రకృతి ఎప్పుడు ప్రభుస్తానాన్ని ఆక్రమించలేదని గ్రహిస్తాము. వివేకం ఎప్పుడు కల్గుతుందో అప్పుడే భయం సంపూర్ణంగా మన నుండి దూరంగా పారిపోతుంది. అప్పుడే చిత్తానికి కైవల్యం లభిస్తుంది.
పురుషుడు చిత్తం కాదు అనే విషయాన్నీ వివేకం వలన యోగి గ్రహిస్తాడు.దానికి (ఆ కైవల్యానికి) ప్రతిబంధకాలుగ వెలువడే భాగాలు సంస్కారాల వలన కలుగుతున్నాయి. సుఖప్రాప్తికి బహ్యవిషయాలు అవసరమని మన నమ్మకం. ఇటువంటి విశ్వాస హేతువుగల భావాలన్నీ కైవల్య ప్రాప్తికి ప్రతిబంధకాలు. స్వయంగా పురుషుడు సుఖస్వరుపుడు.పూర్ణానందమయుడు కానీ పూర్వ సంస్కారాలతో ఈ జ్ఞానం ఆవరించబడి వుంది.
సర్వతత్వాలను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక వుండేవానికి అటువంటి పరిపూర్ణవివేకం ఫలితంగా ధర్మమేఘం అనే సమాధి కలుగుతుంది.ఇటువంటి జ్ఞానం కలిగిన యోగికి ఎన్నో సిద్దులు కలుగుతాయి, కానీ, నిజమైన త్యాగి వాటినేల్లా పరిత్యజిస్తాడు. అటువంటి వానికి ధర్మమేఘం అనే విచిత్ర వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది.   
అపూర్వ జ్ఞానం వలన (అవిద్యాది) క్లేశాలు, కర్మలు నివృత్త మవుతాయి. దర్మమేఘ మనే సమాధి కలిగితే యోగికి పతన మనేది కలగదు. సర్వక్లేశాలకు, దుఃఖాలకు అతీతుడై పోతాడు.
పురుషుని ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని (సత్వాది) గుణాలను విలోమక్రమంలో లయింపచేయటాన్నిగాని, చిత్ ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెలకొల్పాడాన్ని కానీ కైవల్యమంటారు. ప్రకృతి వహించిన కార్యం పరిసమాప్తమైంది. తనను తను మరచిన పురుషునికి ప్రకృతి, చేయూతనిచ్చి, ప్రపంచానుభావాలను, ద్రుస్యాలన్నితటిని చూపి అతను తను కోల్పోయినా వైభవాన్ని పొంది, స్వస్వరూప జ్ఞానం పొందేవరకు, క్రమక్రమంగా వివిధ శరీరాల మూలంగా అతన్ని ఉన్నతస్తితికి తీసుకొని వస్తుంది.   
స్వస్వరూపాన్ని పొందిన మహానుభావులందరికి జయముకలుగుగాక! వారి ఆశీస్సులు మన అందరు లభించుగాక!

No comments:

Post a Comment