My Blog List

My Blog List

Saturday, January 4, 2014

ఓంకార రహస్యము :


ఓం నమో పరమాత్మయే నమః 

ఓంకారాన్ని గురించి తెలుసుకోవాలన్న... దానిని అర్ధం చేసుకోవాలన్న... ఆచరించాలన్న మనకు ఒక అర్హత అవసరం... అందుకే మన హిందూ ధర్మాలలో మంత్రోపదేశం చేయటం చాల జాగ్రత్తగా చేస్తారు... ఒక రహస్యాన్ని రహస్యంగా కాపాడడంలో విశిష్టత ఉంది... నేను ఆ విశిష్టతకు ఏమయినా భంగం కలిగిస్తున్ననేమో అని బాధ పడుతున్నాను... కాని మన ఓంకారం గురించి తెలిసిన వాళ్ళు చాల తక్కువ మంది ఉండడటం గమనిచాను.... అందుకే ఈ రోజు నుండి కొంత వివరణ ఇచేందుకు ప్రయత్నిస్తున్న... నేను పండితుడిని కాను... ఏమయినా తప్పులుంటే క్షమించండి... మిత్రులారా ఓంకారాన్ని గురించి వినడం ఒక ఎత్తు ... అర్ధం చేసుకోవడం ఒక ఎత్తు.... ఓంకారాన్ని స్పష్టం గ ఉచ్చరించి దానిని అనుభూతి పొందడం ఒక ఎత్తు..... ఆ అనుభవాన్ని మీరూ స్వంతం చేసుకోండి... దాని అనుభూతిని నాతొ పంచుకోండి... ఓంకారం సంస్కృతంలో ''''అక్షరం దైవంతో సమానం ఓంకారమనేది.....చాల మంది అనుకునే విధంగా "ఓ" అనే అక్షరం తో ప్రారంభమయి "0" తో ముగిసేది కాదు... ఇది 3 అక్షరముల సంగమం ... అవి ఆ + ఊ + మ్ ఆ --- అనే అక్షరాన్ని నాభి స్థానం నుండి ఉచ్చరించాలి.... అంటే మనం ఈ అక్షరాన్ని పలికేది గొంతు నుండి అయిన భావన నాభి (బొడ్డు) (స్వాధిష్టాన చక్రం) దగ్గర మొదలవ్వాలి... ఊ -- ఈ అక్షరం గొంతు (విశుద్ధ చక్రం) నుండి ఉచ్చరించాలి... మ్ - ఈ అక్షర ఉచ్చారణ మన శీర్శాగ్రం (సహస్రార చక్రం ) నుండి వెళ్లి పోవాలి... స్వాధిష్టాన చక్రం -- అధిపతి.. బ్రహ్మ... అనగా సృష్టి.... విశుద్ధ చక్రం... అధిపతి... విష్ణు... అనగా స్థితి... సహస్రారం.. అధిపతి.... శివుడు... అనగా... లయ ...ఓంకార సృష్టి నాభి దగ్గర... మొదలయి... స్థితి... గొంతు దగ్గర ఉండి... శీర్శగ్రం దగ్గర లయం కావాలి... ఈ మూడు అక్షరాలను జాగ్రత్తగా ఉచ్చారించటం వలన మన లోని 3 చక్రాల గుండా cosmic energy ... మూల శక్తితో సహస్రారం ద్వార synchronize అవుతుంది... అపుడు శరీరం లో కలిగే నిజమయిన ప్రకంపనాలను మాటలలో వర్ణించ లేము.... (జ్ఞానేంద్రియాలకు అతీతమయిన వాటిని మాటలలో బోధించలేము... ) 

No comments:

Post a Comment