My Blog List

My Blog List

Tuesday, January 7, 2014

సత్సంగంలోని సాధువచనాలు :

ఓం నమో పరమాత్మయే నమః 

1. మానవులు తమ జీవన కాలాన్ని అమూల్యంగానూ క్షణికంగానూ కూడ భావించి సమయాన్ని ఉత్తమోత్తమ కార్యములలో లగ్నంచేయాలి. క్షణకాలాన్ని కూడ వ్యర్ధం చేయరాదు.
2. ఏ కారణముచేత నైన ఏక్షణమైన భగవచ్చింతనా రహితంగా గడచిపోతే పుత్రశోకం కన్న మిన్నగ పశ్చాత్తాపము చెందవలెను. తద్వార భవిష్యత్తులో నట్టి పొరబాటు జరగరాదు.
౩. కాలాన్ని వ్యర్ధం చేసిన వాడు కాలపు విలువ తెలియని వాడగుచున్నాడు.
4. మానవమాత్రుడు ఎన్నడూ వ్యర్ధంగా ఉండరాదు సరికదా సర్వోత్తమ కర్యాచరణము జేయాలి.
5. మనసా భగవచ్చింతన, వాచా భగవన్నామజపం సర్వులనూ నారాయణ భావంతో స్వీకరించి కర్మణా జగజ్జనార్ధనులను నిస్స్వార్ధంగా సేవించడం, ఇదియే సర్వోత్తమ కార్యము.
6. మాటలాడునపుడు సత్యంగా, ప్రియంగా, మితంగా, హితంగా, శాస్త్రానుకూలంగా భాషించాలి.
7. పరుల ద్వారా తన దోషాలను ఆలకించి మనసా ప్రసన్నుడై ఉండాలి.
8. పరులెవరైనా మనదోషాలను వ్యక్తం చేసినచో వాటినిగురించి చర్చించరాదు, చర్చించినచో దోషాలు వదిల్లుతాయి. దోషారోపణ చేసేవారి మనస్సులలో భవిష్యత్తులలో ఆటంకాలు సంభవిస్తాయి. అట్టిదశలో మనం నిర్దోషులము కాజాలము.
9. మనమే నిర్దోషులమయితే దోషాలను ఆలకించి మౌనంగా ఉండాలి. అంతమాత్రాన మనకెట్టి హాని సంభవించదు. దోషులమైతే మన దోషాలను రూపుమాపుకోవాలి.
10. దోషాలను చూపెవారిని గురుతుల్యులుగా భావించి ఆదరించాలి.తద్వారా అతడు భవిష్యత్తులో మన దోషాలను ఉత్సాహంగా చూపగలుగుతాడు.
11. ఎవరితోనైన నీకు పని పడితే అతణ్ణి నీ దగ్గరకు పిలువక నీవే అతని దగ్గరకు వెళ్ళు.
12. శరీర నిర్వహణార్ధం కూడ అనాశక్తి భావంతోనే పదార్థాలను ఉపయోగించాలి.
13. వ్యవహారవేలలో భజన, ధ్యానాలలో ముఖ్యవ్రుత్తినీ సంసారిక కార్యాలలో గౌణవృత్తిని పొంది వ్యవహరించాలి.
14. పరున్న వేళలో సైతం భగవంతుని స్మరణ విశేషంగా చేయాలి. దానివల్ల శయన సమయం వ్యర్ధం కాదు. శయన సమయాన్ని సాధనగా చేయడం కోసం సంసారిక సంకల్ప ప్రవాహాన్ని విస్మరించి భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి.
15. తనపై పరమాత్మకుగల అహైతుక దయ, కృప ప్రేమలను పదేపదే స్మరించుకుంటూ సర్వ సమయాలలోనూ ప్రసన్నంగా ఉండాలి.
16. సర్వప్రాణుల యందు నిర్హేతుకమైన దయ, ప్రేమలను కలిగి ఉండాలి.
17. ఏకాంతవేళలో మనసా పరమాత్మను వినా అన్యచింతన చేయకు. వ్యర్ధ చింతన వల్ల హాని తప్ప లభించేదేమి ఉండదు.
18. భగవంతుని మించిన హితైసి మనకు వేరే ఎవరు లేరు. కావున స్వాధీనంలో ఉన్న సర్వస్వాన్నే కాదు. బలిచక్రవర్తి వలె నిన్ను నీవు కూడ భగవంతునికి అర్పణ చేసుకోవాలి.
19. భగవత్ ప్రాప్తికై మానవుడు పాత్రుడై ఉండగలగాలి. పాత్రుడు కావడంతో భగవంతుడు స్వయంగా శీఘ్రంగా దర్శనమిస్తాడు.
20. భగవత్ ప్రాప్తి, పవిత్ర, ఏకాంత దేశసేవనం, సత్సంగ, స్వాధ్యాయ, పరమాత్మా ధ్యానం, భగవన్నామ జపం, జ్ఞాన, వైరాగ్య, ఉపరతులకు మించిన సాధనములు లేవు.
21. భగవంతునిని స్మరిస్తూనే సామాజిక, వ్యవహారిక ఆర్దికాది కార్యాలను నిస్వార్ధ భావంతో చేయాలి.           
22. కర్తవ్య కార్యాలను భగవంతునిని స్మరించుకుంటూ ప్రసన్నంగా ముగ్దుడై చేయగలిగితే మహోన్నత సాధన అవుతుంది.
23. కర్తవ్యపాలన రూప పరమపురుషార్ధమే ముక్తికి ముఖ్య సాధనము.
24. ధన ప్రాప్తి మనకు వశమైన విషయంకాక పాయిన మానవ శరీర నిర్వహణార్ధం కర్తవ్య బుద్ధ్యా న్యాయయుక్తంగా అవశ్యం పరిశ్రమించవలసిందే.
25. సుఖ దుఃఖాలలో యేది లభించిన అది భగవంతుని మంగళవిధానమేనని గ్రహించి మానవుడు సదా పరమసంతుస్టుడై ఉండాలి.
26. ఉత్తమ కార్యాన్ని శీఘ్రాతి శీఘ్రంగా చెయ్యాలి, కారణం? ఈ శరీరం క్షణభంగురమైనది.
27. భగవంతుని సత్తాపై ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ధృడంగా విస్వశించాలి. భగవంతునిపై విశ్వాసం యెంత ప్రబలంగా వుంటే అంతగా పాపకార్యాలనుండి రక్షించబడతాము. అట్టి దశలోనే సాధకుని సాధన తీవ్రతరమవుతుంది.
28. సదా సర్వదా భగవంతునిపై ఆధారపడి ఉండాలి. తద్వారా ధైర్యం, వీరత్వం, గాంభీర్యం, నిర్భయత్వం, ఆత్మబలాదులు వర్దిల్లితాయి.
29. విశుద్దమైన ఈశ్వర ప్రేమ ఓ మహత్తర గోపనీయమైన పరమరహస్య వస్తువు. దానిని అధిగమించి మహోత్తమ వస్తువు యేదిలేదు.
౩౦. భగవత్ జ్ఞానానికి మించిన జ్ఞానం లేదు.
31. పరమాత్మ ప్రభావానికి మించిన ప్రభావం లేదు.
32. భగవద్దర్శనానికి మించిన దర్శనం లేదు.
౩౩. మహాపురుషుని ఆచరణకు మించి అనుసరించదగిన ఆచరణ లేదు.
34. భగవత్ భావానికి మించిన భావం లేదు.
35. సమత్వానికి మించిన న్యాయం లేదు.
36. సత్యానికి మించిన తపస్సు లేదు.
37. పరమాత్మా ప్రాప్తికి మించిన లాభామేది లేదు.
38. సత్సంగానికి మించిన మిత్రుడు లేడు. దుస్సాంగత్యానికి మించిన శత్రువు లేడు.
39. ధ్యానానికి మించిన సాధన లేదు. జ్ఞానానికి మించిన పవిత్రం లేదు. భగవంతునికి మించిన ఇష్టమైనది లేదు.
40.  భగవత్ ప్రాప్తి విషయాలు వినా మనస్సులో మరెట్టి విషయాలను ఉంచుకోరాదు. మనస్సులో ఏ ఇచ్ఛా ఉన్న పునర్జన్మను పొందాలి కనుక ఇచ్ఛా, వాసన, కామన, త్రుష్ణాదులను సర్వదా త్యజించాలి.
41. నీ కోరిక ఏమిటి? అని పదే పదే మనస్సును ప్రశ్నించు. ఏది లేదు అని మనస్సు నుండి సమాధానం లభించాలి. ఈ ప్రకారమైన అభ్యాసం ద్వార కోరిక నాశనమవుతుంది. ఇది నిశ్చితమైన విషయం.
42. ప్రపంచంలోని యే వస్తువునందు ఆశక్తి కలిగి ఉండరాదు. కారణం ఆసక్తి ఉంటే అంతకాలంలో దానికి సంబంధించిన సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలిగిందో పునర్జన్మ తప్పదు.
43.  శక్తి ఆసక్తులను అనుసరించి కలిగే స్ఫురనకే సంకల్ప మనిపేరు.
44. విశ్వాన్ని, శరీరాన్ని ఎప్పుడు కాలుని నోటిలో ఉన్నట్లే భావించాలి.
45. జీవిస్తుండగానే శరీరాన్ని మృత ప్రాయంగా జీవించగలవాడే జీవన్ముక్తుడు.
46. న్యాయంగానే ధనాన్ని సముపార్జించాలి. ఎన్నడూ అన్యాయంగా సంపాదించకూడదు, ఆ దశ వస్తే ఆకలితో చావనైనా చావాలి.
47. దైవభక్తి, ఆదర్శాలను యెన్నడు విడిచి పెట్టరాదు. ఆ కార్యంలో ప్రాణాలు పోయిన లెక్క చేయరాదు.
48. ధైర్యం, క్షమ, మనోనిగ్రహం, అస్తేయం, బాహ్యాభ్యంతర పవిత్రత, ఇంద్రియనిగ్రహం, సాత్వికబుద్ది, ఆధ్యాత్మవిద్య, సత్యభాషనము, క్రోధం వహించకుండుట యను పదియూ సామాన్య ధర్మ లక్షణములు.
49. స్వార్ధ త్యాగం సమాన వ్యవహారం కన్న శ్రేష్టమైనది కనుక సర్వులనూ నిస్వార్ధ భావంతో సేవించాలి.
5౦. స్త్రీలకు పాతివ్రత్యధర్మమే సర్వోత్రుష్టమైన సాధన. కనుక భగవంతుని స్మరిస్తూ భర్త ఆజ్ఞలను పాలించాలి. భర్తయొక్క, పెద్దలయొక్క చరణాలకు ప్రణమిల్లి సర్వులను యధా యోగ్యమైన రీతి సేవించాలి.
51. వితంతు స్త్రీ విషయ భోగాలనుండి విరక్తయై, భగవద్భక్తితో సద్గుణ సదాచారాలను పాలిస్తూ నిస్వార్ధభావంతో సర్వులను సేవించడం సర్వోత్తమ ధర్మమై ఉంది.
52. పరులకు ఉపకారము చేసి ప్రయోజనాన్ని ఆశించరాదు. ఎవరకి చెప్పకూడదు, అలాచేస్తే చేసిన ఉపకారం క్షీణిస్తుంది. సర్వం భగవంతుడే చేయిస్తున్నాడని తాను నిమిత్త మాత్రుడననీ గ్రహించాలి.
5౩. ఎవరైనా మనకు ఉపకరిస్తే వారిని జీవితాంతం మరువరాదు. ఉపకారికి విశేషంగా మనం ప్రత్యుపకారం చేసినా వానిని మరువకూడదు.
54. మనసేంద్రియాలను అదుపులోనుంచుకోవాలి. అవి వ్యర్ధంగా పాపకర్మల వైపు పోకుండా చూసుకోవాలి. మనం వినియోగించిన భగవత్ ప్రాప్తి మార్గం వైపు అవి పురోగమిస్తూ ఉండాలి.
55. జ్ఞానవైరాగ్య, భక్తి, సద్గుణ సదాచార సేవ, సంయమాలను అమృత సమంగా భావించి సర్వదా వీటిని సేవించాలి.
56. శౌచాచారం కన్న సదాచారం మహోన్నత మయింది. దానికన్నా సర్వోత్తమమైనది భగవద్భక్తి అని తెలుసుకో.
57. భగవంతుడు జాతిమత భేదాలను చూడడు, కేవలం ప్రేమ భావాన్నే చూస్తాడు. కనుక మానవమాత్రుడు భగవంతుని ప్రేమించాలి.
58. ఏకాంతంలో కరుణాభావ పూర్ణంగా విలపిస్తూ స్తుతించడం వల్ల, ప్రార్ధన చేయడం వల్ల శ్రద్ధవర్ధిల్లుతుంది.
59. తల్లి, తండ్రి, భర్త, స్వామి, జ్ఞానీ, మహాత్ములు, గురుజనులు వీరిని శ్రద్ధతో నిస్వార్ధంగా సేవించడం వలన శీఘ్రమే మోక్షప్రాప్తి కలుగుతుంది.
60. నిష్కామకర్మవల్ల, భవన్నామ స్మరణ మరియు జపం వలన, సత్సంగ స్వాధ్యాయాలా వల్ల, దురితమైన ఆవరణలు సర్వధా నశించి శీఘ్రమే భగవత్ ప్రాప్తి కలుగుతుంది.
61. శుభాలను శీఘ్రంగా కోరునట్టి వాడు పరమాత్మా ప్రాప్తి వినా ఎట్టి అన్యేచ్చను కలిగి ఉండరాదు. కారణమేదంటే దీనికన్నా వేరైన కోరికలన్నీ జన్మమ్రుత్యరూప సంసార సాగరంలో పరిభ్రమింపజేసేవే.
62. పరమాత్మా ప్రాప్తి కోసం మానవ మాత్రుడు అర్ధ, భావసహిటంగా శాస్త్రాలను అనుశీలించడం ,ఏకాంతంలో ఆశీనుడై ఆధ్యాత్మ విషయాలను గురించి యోచించడం నియమపూర్వకంగా నిత్యం చేయాలి.
6౩. జీవ, బ్రహ్మ, మాయతత్వం గ్రహించడానికి ఏకాంతంలో కూర్చుని వివేక వైరాగ్యయుక్తమైన చిత్తంతో నిత్యం పరమాత్మను చింతిస్తూ ఆధ్యాత్మ విషయ చింతన చేయాలి.
64. భగవంతుని ప్రేమ, దయాతత్త్వాల రహస్యాలను గ్రహించినవానికి శాంత్యానందాల సరిహద్దులుండవు.
65. తనకు తానూ పరమాత్మకు అర్పించుకున్న వాడు, ఆ దేవదేవుని మీదనే ఆధార పడినట్టి వానిని సర్వదా సర్వవిధాల ఆ భగవంతుడే రక్షిస్తాడు. తద్వార అతడు శాశ్వతమైన నిర్భయ పదాన్ని అందుకోగలుగుతాడు.
66. భగవంతుడు మహాదయాళువు, ప్రేమికుడు. ఈ తత్త్వాన్ని గ్రహించిన సాధకుడు భగవంతుని శరణువేడి శీఘ్రమే పరమ శాంతిని పొందుతాడు.
67. సర్వత్రా భగవద్భావంతో సమానమైన భావమేది లేదు. సర్వత్రా భగవద్భావం కలిగి ఉండడం వలన దుర్గుణ, దురాచారాలు దూరమై, సద్గుణ సదాచారాలు తమంత తామై లభిస్తాయి.

68. ద్రుగోచర వస్తుజాలమంతా భగవత్సరూపంగాను చేస్టలన్నియు భగవంతుని లీలగాను గ్రహించడం వల్ల భగవత్తత్వం అర్ధమవుతుంది.

No comments:

Post a Comment