My Blog List

My Blog List

Thursday, March 20, 2014

ఏమయ్యా నీ హిందూ మతం లో ఇంతమంది దేముళ్ళ?

ఏమయ్యా నీ హిందూ మతం లో ఇంతమంది దేముళ్ళ ?? మిగతా మతాలలో ఒక్కడే దేముడు ?? నీ మతం లో ఎవరిని పూజించాలి ???
మొదట మీరు వేద సారాన్ని అర్ధం చేసుకోవాలి , వేదాలలో చాల స్పష్టంగా చెప్పేరు, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నిరాకారుడు ( ఆకారము లేనివాడు ), మహా శక్తీ వంతుడు. అవును భగవంతుడు ఆకారము లేనివాడు అందుకే వివిధ రూపాలలొ ఉంటాడు.
పాము రూపములొ ( నాగేంద్రుడు)
నంది రూపములొ ( నందీశ్వరుడు ).....మొ ||
హిందూ మతం అంటే ప్రకృతిని పూజించే మతం. అంటే భగవంతుడిని వివిధ ప్రకృతి రూపాలలొ పూజిస్తాము. భగవంతుడు( శక్తీ ) ఒక్కడే . నీవు ఏ రూపమున పూజించిన ఆ మహా శక్తీ నే పూజిస్థావు . ఆ భగవంతుడు కూడా, భక్తుడి వైన నీ అభీష్టం మేరకే, నీవు పూజించిన రూపములొ నీకు సాక్షాత్కరిస్తాడు.
భగవంతుడు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తీ.
శక్తీ ని నువ్వు కళ్ళతో చూడలేవు, సైన్స్ కుడా ఇదే చెపుతోంది. సైన్స్ లో శక్తీ కి నిర్వచనం
"
శక్తీ ని సృష్టించలేము, నాశనము చేయలేము, శక్తీ ఒక రూపములొ అద్రుస్యమయి, మరొక రూపములొ ప్రత్యక్షమవును" ఇది సైన్స్, శక్తీ కి ఇచ్చిన నిర్వచనము.
హిందూ మతం లో, మిగతా మతాల లాగ ఏదో 2 కర్రల్లో దేముడు ఉన్నాడని చెప్పలేము.
"
భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేదే హిందూ మతం. "
భగవంతుడు మనిషి లో ఉన్నాడు అని చెప్పుతం, అదే వామనావతారం
భగవంతుడు పక్షి లో ఉన్నాడు అని చెపుతాము అదే, గరుడ దేముడు.
గాలి, వాయుదేముడు. ఇలా భగవంతుడు ప్రకృతి అంతా ఆవహించి ఉన్నాడు. ప్రకృతి లో ఉన్న ప్రతి ప్రాణి లో భగవంతుడు ఉన్నాడు. కేవలం మనిషి లో, మనిషి రూపములో దేముడు ఉన్నాడు అనటం మూర్ఖత్వమ్.

No comments:

Post a Comment