My Blog List

My Blog List

Thursday, March 6, 2014

సాయిబాబా దివ్యవాణి :



బాబా ఒకసారి భక్తులతో ఇలా అన్నారు :
మీరెక్కడ నున్నప్పటికి, ఏమిచేసినప్పటికి నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమందు చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సుత్రదారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియచాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే. ఎవరైతే తమ ద్రుష్టి నావైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగాని, బాధగాని కలుగదు. ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.
బాబా తనభక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను :
నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తిశ్రద్దలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూచెదను.
సాయి రామ్, రహీమ్ కూడ అని అల్లా ఆయనే. దేవుడు ఆయనే, అనంతుడు ఆయనే. కబిరే నా మతం, భగవంతుడే నా కులం అని అన్నారు.  
నేననగా ఎవరు? అని సాయిబాబా ఎన్నో సార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు. నన్ను వెదకుటకు నీవు దూరముగాని, మరెచ్చటకుగాని వెళ్లనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలో, చైతన్యము లేదా అంతరాత్మ కలదని అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్నింటిలోను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకాత్వమనుభవించి నాలో ఐక్యము పొందెదవు.
దైవ సాక్షాత్కారానికి సాయిబాబా చెప్పిన పది సూత్రాలు :
1. ఈ లోకం క్షుద్రమైనదని తెలిసి ఇహపర సుఖాల మీద మమకారం వదులుకోవాలి.
2.
బంధ విముక్తికి నిరంతరం పాటుపడాలి.
3.
ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు అంతర్ముఖుడు కావాలి.
4.
జ్ఞానం సంపాదించిన, దుశ్చర్యలు మానకపోతే శాంతిలేదు.
5.
సత్యం, తపస్సు, అంతర్ముఖం, సదాచారం సాధకుడికి అవసరం.
6.
వివేకవంతుడు శ్రేయస్సు, గొప్పతనాన్ని గ్రహించాలి.
7.
ఇంద్రియ నిగ్రహం లేకపోతే గమ్యం చేరలేడు.
8.
మనస్సు నిష్కామనగా, నిర్మలంగా ఉండాలి.
9.
సద్గురువును ఆశ్రయించి జ్ఞానం పొందాలి. ఆత్మ నిగ్రహం అలవరచుకోవాలి.
10.
అన్నిటికంటే భగవనుగ్రహం ముఖ్యం. నిరాశలో, నిశ్ప్రుహలో అది ఆశాకిరణం.
మానవుడు యత్నించవలసినది (శ్రీ సాయి సచ్చరిత్ర : ఎనిమిదవ అధ్యాయం)
మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను. ఈ మాత్రమును ఆశ్రద్దగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకై త్వరపడవలెను. చదువు అయిపోయిన విద్యార్థి ఉద్యోగం కోసం ఏ విదంగా ఆతురతపడతాడో, యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్దకము, అలసటను, కునుకుపాట్లు దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయనిచో మనము పశుప్రాయులమగుదుము. 
మన ప్రవర్తన గురించి బాబా యుపదేశము (శ్రీ సాయి సచ్చరిత్ర : తొమ్మిదవ అధ్యాయం) :
ఏదైన సంబంధ ముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్ధాక్షిన్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగ ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చోనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీ కిచ్చుట ఇష్టము లేకున్నచో, నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకోనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడు సర్వాధికారి. ఇతరు లెవ్వరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గ మసామాన్యము. మిక్కిలి విలువైనది. కనుగొనుటకు వీలు లేనిది. వారి ఇచ్చానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నేరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను, సంతోషముగాను నుందుము గాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమె బ్రతికెదరు.            
ప్రార్ధన (శ్రీ సాయి సచ్చరిత్ర : 25 వ అధ్యాయము) :
ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములయందు, దుర్మార్గపు పనులందు మాకుగల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది.   
శ్రీసాయి యొక్క అనంత తత్త్వములో ముఖ్యమైనవి ౩ కలవు :
శ్రీసాయి ఇట్లనెను.
1.      ఊరకే గ్రంధములు చదువుట వలన ప్రయోజనము లేదు. చదివిన విషయములు విచారించి ఆచరణలో పెట్టవలెను.
2.      భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తులను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తులు మరేవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.
3.      ఎవరినీ నిందించకూడదు. తృణీకరించరాదు మరియు ఇతరుల విషయములో జోక్యము చేసుకోరాదు.

1 comment:

  1. వేదశాస్త్రం అంటూ ఈ తురకోడుని తెచ్చేరే స్వామి. వీడొక పిండారీ గజదొంగ.

    ReplyDelete