My Blog List

My Blog List

Monday, March 31, 2014

నిర్వచనాలు:

తపస్సు : భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే తపస్సు’ అంటారు. (భగవద్గీత)
ధ్యానం : ఒంటరిగా కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి ధ్యానించడాన్నే ‘ధ్యానం’ అంటారు. (భగవద్గీత)
సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘సన్యాసం’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘వైరాగ్యం’ అంటారు. (భగవద్గీత)
జ్ఞానం : భగవంతుడు నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘జ్ఞానం’ అంటారు. (భగవద్గీత)

బ్రహ్మచర్యం: ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే బ్రహ్మచర్యం అంటారు. (రమణ మహర్షి)

No comments:

Post a Comment