My Blog List

My Blog List

Monday, March 31, 2014

ఆత్మహత్య చేసుకోరాదు....ఎందుకు? (ఆధ్యాత్మికంగా మరియు సాధారణంగా) :

మన దేశంలో ఈ మధ్య కాలంలో ఆత్మ హత్యలు చేసుకోవడం మరీ ఎక్కువైపోతుంది. దీనికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంది. కారణం ఏదైనా కావచ్చు కాని, ఆత్మ హత్యకు దారి తీసేంత కారణం ఏదియును ఈ ప్రపంచంలో లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారాన్ని తెలుసుకోలేకే ఆత్మ హత్యకు పాల్పడుతున్నారు. కొందరైతే మరీ చిన్న చిన్న విషయాలకు కూడ ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు అంటే ప్రేమ గురించి అనో, భార్య భర్తల మనస్పర్ధలు అనో, తల్లి తండ్రులు అరిచారి అనో లేక వాళ్ళు ఏదైనా అడిగితె కొనివ్వలేది అనో ఇలా చిన్న చిన్న విషయాలకు కూడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆత్మ హత్యని ప్రభుత్వాలు కూడ నేరంగనే పరిగనిస్తాయి. ప్రభుత్వాలే కాకా అన్ని మతాలు కూడ పాపంగా పేర్కొని నిర్ద్వంద్వంగా నిషేదించాయి కూడ. చివరికి నాస్తిక మతాలైన బౌద్ద మరియు జైన మతాలూ సైతం ఆత్మహత్యను ఖండించాయి.
ఆత్మ హత్య చేసుకోవద్దు అనే చెప్తున్నారు కాని ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు మంచిది కాదో ఎప్పుడు ఎవరు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. అందుకే బహుశ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువై పోతున్నాయి ఈ ఆత్మ హత్యలు.
ఏదో ఒక సందర్భంలో మనిషికి ఇంకేంటి దిక్కు ,ఆత్మహత్య తప్ప? అన్న శిష్యుడితో వివేకానంద స్వామి అందుమూలముగా ఇంకా కీడు మూడుతుంది. అలాంటి ఆలోచనే చేయొద్దు. అని వివరించాడు.
నిజానికి చెప్పాలంటే ఎవరి బతుకు వారు బతకడానికి ఉన్న హక్కు ఎవరి చావు వారు చావడానికి లేదా? ఎవరి శరీరం వారిది. దానికి వారు అన్నం పెట్టుకుంటారు. లేదా మానుకుంటారు. కావలిస్తే చంపుకుంటారు. మనకెందుకు? మతాలకెందుకు? ప్రభుత్వాలకెందుకు? అని కొందరు ప్రశ్నిస్తారు కూడ.
ఇది నిజమేనా? ఎవడి బతుకు వాడిదేనా? మనిషికి తన జీవితం మీద అంతులేని స్వయం నిర్ణయాధికారం నిజంగానే ఉందా? ఇవి అన్నియు మనం తెలుసుకోవాలి.
నీకు ఒకదానిమీద స్వత సిద్దమైన అధికారం ఏర్పడాలంటే నీ సొంత సంకల్పంతో, నీ ప్రతిభతో, నీ వనరులతో నువ్వు దాన్ని నిర్మించి ఉండాలి. మానవుడి జీవితం అలా మొదలైందా? నీ పుట్టుక నీ తల్లిదండ్రుల జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్. వాళ్ళు కూడ నీ పుట్టుకకు ముందస్తుగా ఒక ప్రణాళిక రచించి ఉండలేదు. నువ్వెవరో వాళ్లకు తెలియదు. వాల్లెవరో నీకు తెలియదు. పుట్టాక మీరు ముగ్గురు పరిచయం అయ్యారు. నీ పుట్టుక నీ సంకల్పంతో జరిగింది కూడ కాదు. అది నీకు స్పష్టంగా తెలుసు. పోనీ నీకు అంతా తెలివితేటలు ఉన్నాయా? నీ పళ్ళు తోముకునే పళ్ళపొడి కూడ నువ్వు తయారుచేసుకోలేవు. అది కూడ వేరే ఎవరో తయారుచేసి నీకు అమ్మాలి. ఇంకా ఏకంగా శరీరాన్నే నిర్మించుకోవడమా ? ఎంతమాట? నీ సంకల్పంతో ఏదైనా అయ్యేదుంటే ఇలా ఎందుకు పుట్టడం? సూపర్ మ్యాన్ లా పుడతావు. బాల్యం, యవ్వనం ముసలితనం మరియు చావు అనేవి ఏవి లేని ఒక ఉత్కుతునక లాంటి వజ్రదేహాన్ని నిర్మించుకుంటావు. మరేది? ఏది నాయన! చెప్పు, ఎక్కడుంది నీకు స్వేఛ్చ?
కనుక ఈ శరీరం నీది కాదు. ఈ ప్రపంచం కూడ నీది కాదు.నీది అనుకుంటున్న దేది నీది కాదు. నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది. నువ్వు మరణించాక కూడ ఇది ఉంటుంది. వీటన్నిటికి సుప్రీమ్ బాస్ వేరే ఒకరు ఉన్నారు. ఆయనకు దేనితోను సంబంధం లేదు. కాని ఆయనది ఉక్కు పిడికిలి. ఉడుంపట్టు. ఆయన ఆగ్రహం, అనుగ్రహం రెండు ప్రచండమైనవే. నీ శరీరం, నీ జీవితం రెండు కూడ ఆయన ఆస్తి అయివుండగా దాన్ని ఆయన అనుమతి లేకుండా ద్వంశం చేసే హక్కు నీకెవరిచ్చారు? నీ శరీరం ఒక అద్దె కొంప. దానికి నువ్వు చెల్లించాల్సింది అద్దె దాని యజమానిని రోజు తలచుకోవడమే. కిరాయిదారు తన ఇంటిని బాంబులు పెట్టి పేలుస్తానంటే యజమాని ఒప్పుకుంటాడా ? అక్షరాలు దిద్దుకోమని రాసిచ్చిన పలకని నేలకేసి పగలగొడితే తండ్రి ఊరుకుంటాడా? నా ఇల్లు, నా పలక నా ఇష్టం అని వాదించగలవా?
భగవంతుడు తన సృష్టిలో మనిషికి స్వేఛ్చ అంటూ అనుమతించి ఉంటె అది అత్యంత పరిమితం.ఒక త్రాటితో ఒక ఆవుని కట్టేసినపుడు ఆ తాడు ఎంత వ్యాసార్ధాన్ని ఏర్పరచగాలదో అంతా పరిధిలో మాత్రమే ఆ ఆవు మెయ్యగలదు. మనిషికి కూడ దేవుడిచ్చిన స్వేఛ్చ ఇలాంటిది. కాని మనిషి గొప్పతనమేమిటంటే ఈ కొద్దిపాటి స్వేచ్ఛతోనే అంతులేని పాపాలు చెయ్యగలగడం. దానవుడవుతాడు మనిషి దైవాన్ననుకున్నప్పుడు. మనిషికి దేవుడు కొంతలో కొంత స్వేఛ్చ ఇవ్వకపోలేదు. అది కూడ ఇచ్చి ఉండే వాడు కాదు. కాని మోక్షం సంపాదించుకోవాలంటే ముందు జ్ఞానాన్ని ఆర్జించుకోవాలి కనుకా, స్వేఛ్చ లేకపోతె జ్ఞానానికి అర్ధం లేదు కనుకా ఆ మాత్రం ఇవ్వక తప్పదని భావించి ఇవ్వడం జరిగింది.               
ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడని సర్వజ్ఞుడైన దేవుడికి ముందే తెలియదా? అటువంటప్పుడు మనిషి బాధ్యత ఏమిటి? అందుకు అతన్ని పాపిని చేసి మాట్లాడడం ఏంటి? అని కొందరనుకుంటారు. మనిషి జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి గ్రహసంయోగాల్ని పేర్కొంటున్న జ్యోతిశాస్త్రం ఆత్మహత్యకు సంబంధించి మాత్రం నీళ్ళు నములుతుంది. మనిషి పుట్టకముందే దేవుడు రాసే నొసటిరాత గురించి మాత్రమె జ్యోతిశ్శాస్త్రం మాట్లాడగలదు అని చెప్తారు. ఆ రాతలో లేనిది జాతకంలో కనిపించదు. జాతకాల్లో గండాలు, ప్రమాదాలు ఉంటాయి తప్ప ఆత్మహత్యలు ఉండవు అని చెప్తారు.
పో! భూలోకంలో పుట్టి ఆత్మ హత్య చేసుకో అని ఎవరికీ నొసటిరాత రాయడు దేవుడు. అలా రాసేవాణ్ని మనం దేవుడు అనం. ఆత్మహత్య అనేది మనిషి తనకివ్వబడిన స్వేచ్చని దుర్వినియోగ పరుస్తూ దైవాన్ని ఎదిరిస్తూ తన యొక్క ఆకస్మికమైన స్వసంకల్పంతో కర్మ ఫలంపై తీసుకునే నిషిద్దమైన చనువు.
పసిబిడ్డ హృదయం గల భగవంతుడు అలుపు-సొలుపు లేని ఆశావాది. మనుషులు ఎంతగా పతనమవుతున్నా వీళ్ళంతా ఎదో ఒక రోజు బాగుపడుతారు అనే ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కొద్దిమంది కొద్దిసేపు బాగుపడ్డా సరే ! ఆ అల్పసంతోషి సంతృప్తి చెందుతూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఎదురు చూస్తాడు. అయితే ఆత్మహత్య ఒక మనస్తత్త్వం ఏమి కాదు. అదొక క్షణిక ప్రేరణ.    
మనిషికి శరీరంలో ఒక మెదడుందని మనమందరం అనుకుంటాం. కాని వాస్తవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మెదడుంది. ఆ మెదల్లన్ని ఒక కేంద్ర మెదటికి లోబడి పనిచేస్తూ ఉంటాయి. తద్వారా కేంద్రమెదటికి (పరమాత్మస్వరూపమైన) జీవాత్మ అధిస్టానమైనట్లు ఆయా చిరుమెదళ్ళకు కూడ వేరువేరు అధిష్టాన దేవతలు ఉంటారు. ఆయా అధిష్టానదేవతలు ఆయా అవయవాల్లో నిత్యనివాసం చేస్తారు. వాళ్ళు మనిషి పుట్ట్టకముందే దైవాదేశం మేరకు అతని/ఆమె అవయవాల్లో తిష్టవేస్తారు. వాళ్ళని భౌతిక శరీరంలో కాక అందులో ఉన్న సూక్ష్మ శరీరంలో మాత్రమె దర్శించగలం. ఆ కారణం చేతనే దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః (ఈ దేహమే పవిత్రమైన దేవాలయం. ఇందులో నివసించే జీవుడే నిత్యుడు, సత్యుడు అయిన సనాతన భగవంతుడు) అని మన పూర్వికులు మొత్తుకున్నది. అలాగే చావు సమీపించినపుడు దైవాదేశం మేరకు ఆయా దేవతలు (జీవశక్తులు) తమంతట తాముగా శరీరాన్ని విడిచి వెళతారు. కాని వారు మృతశరీరంలోని పంచభూతాల్లాగ చెల్లాచెదురు అవరు. వారు సూక్ష్మ శరీరాన్ని లోకాంతరాలకు తరలిస్తారు. దాంతో పాటే ఉంటారు. అవి గతజన్మలకు చెందిన పాత కర్మఫలాల యొక్క, జ్ఞాపకాల యొక్క దస్తావేజుల్ని జన్మ నుంచి జన్మాంతరానికి మోసుకేల్తారు.     
నిజానికి జన్మ ఎత్తెది ఆత్మ కాదు, సూక్ష్మ శరీరమే. మనుషులు మేల్కొన్న స్థితిలో నేను-నాది అని వ్యవహరించేది కూడ దాన్నే. జనం దాన్ని ఆత్మ అని వ్యవహరించడం కేవలం భ్రమప్రమాదజనితం. శుద్దపోరపాటు మాత్రమె. ఆత్మస్థితిలో నేను-నాది ఉండవు. ఆత్మకు జన్మలు, చావులు, సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు, శుభాశుభాలు, దేశకాలాలు ఏమి లేవు. అది ఒక దేహానికీ, ఒక మతానికీ, ఒక లోకానికీ పరిమితం కాదు. జీవులు-జడాలు, కుర్చీలు-బల్లలు, రాయి-రప్ప, చెట్టు-పుట్ట అన్నింటిలోను ఉండే సర్వాతీత సర్వాంతర్యామి ఆత్మ. అది అస్తిత్వానికే అస్తిత్వం. దానికే దేవుడని నామాంతరం.
ఎందుకు చెబుతున్నానంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు తమ శరీరంలోని అధిష్టాన దేవతల్ని అకాలంగా బలవంతంగా వెళ్ళగొడతారు. దైవాదేశం లేకపోవడం చేత ఆ దేవతలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాని నశించిపోతున్న శారీరంలో ఉండడం సాధ్యపడదు. సదరు దేహం సహజంగా నిర్ణీత సమయానికి పతనమయ్యేటప్పుడు దాని పాత ఫైళ్ళని సజావుగా ప్రశాంతంగా ఇంకో జన్మకి బదిలీ చెయ్యడానికి వాళ్ళు నియమించబడ్డారు. ఆ ఫైళ్ళలో గతజన్మల పాపాలు, పుణ్యాలు, జ్ఞాపకాలు, వాటికి నిర్ణయించబడ్డ ఫలితాలు అన్నీ ఉంటాయి. దైవద్రోహియైన జీవుడితో కలిసి ఉండడానికి వాళ్ళకిష్టం లేకపోవడంతో ఆ ఫైళ్ళు పట్టుకొని వాళ్ళు తమ లోకాలకు తాము వెళ్ళిపోతారు. తిరిగి దైవాదేశం వచ్చేదాకా శారీరంలో ప్రవేశించడానికి వాళ్ళు సాహసించరు. ఇంక మిగిలేది ఏమిటి? అంటే ఏ అధిష్టాన దేవతలు లేనటువంటి పాడుబడ్డ దేవాలయంలాంటి దైవద్రోహపు సూక్ష్మశరీరం. అధిష్టాన దేవతలు గతం తాలూకు అన్ని ఆనవాళ్ళు తమవెంట తీసుకెళ్ళిపోవడంతో జీవి తన సర్వాస్వాన్ని పోగొట్టుకొని రోడ్డున పడ్డ పరమబికారి దివాలాకోరులా మారిపోతాడు/మారిపోతుంది. దేవుడికి దూరమైపోవడం మాట సరేసరి. అంతకుముందు జన్మల్లో చేసిన అమూల్యమైన మహోజ్జ్వలమైన పుణ్యఫలాలను అన్నియు రద్దు అయిపోతాయి. అదొక భయంకరమైన పరిస్థితి. కొట్లలో మీరు డిపాజిట్లు పెట్టిన బ్యాంకు ఆకస్మికంగా ముతపడి పోయాక దాన్ని తిరిగి ఎప్పుడు తెరుస్తారో మీ డబ్బు మీకెప్పుడు చేతికందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడితే మీ అవస్థ ఎలా ఉంటుందో యోచించండి.   
బతికున్న రోజుల్లో సంపాదించుకున్న పుణ్యఫలం అపారంగా ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అతనికి మరల జన్మ ఎప్పుడో ఎవరికీ తెలియదు. అందులో మానవ జన్మ అంటే ఎన్ని కల్పాలు* గడచిపోవాలో అసలు తెలియదు. ఎందుకంటే ఆత్మహంతకులకు వాళ్ళ ఆత్మహత్యా పాతకం పరిహారమయ్యేదాక భగవంతుడు వారికి పిశాచ జన్మనిచ్చి, పునర్జన్మకి పరిస్థితులు అనుకూలించేదాక వేచిచూస్తాడు.    

·         1 కల్పం అంటే 100 మహా యుగాలు.
·         1 మహా యుగం అంటే 10 యుగాలు.
·         10 యుగాలు అంటే 43 లక్షల 2౦ వేల సంవత్సరాలు. 

·         1 యుగం అంటే 43 వేల 2౦౦ సంవత్సరాలు.

No comments:

Post a Comment