My Blog List

My Blog List

Thursday, March 6, 2014

నవవిధ భక్తీ మార్గాలు (Nine discipline of BHAKTHI are) :



భగవంతునిని చేరేందుకు అంటే ఆ పరమాత్మలో ఐక్యమయ్యేందుకు సాయిబాబా తెలిపిన మార్గాలే ఈ నవవిధ భక్తీ మార్గాలు. ఈ నవవిధ భక్తీ మార్గాలలో దేనినైన సరే ఒకదానిని తీసుకొని సరిగా అవలంబిస్తే ఆ పరంధామున్ని చేరడం ఖాయమని ఆయన ఎన్నో సార్లు అయన తన భక్తులతో వివరించారు.
సాయిబాబా తన భక్తులతో ఈ విధంగా చెప్పాడు. భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తి మార్గాలను  తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తి మార్గాలు అంటే ఏవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.

1. శ్రవణము : listening to his exploits శ్రవణము అంటే భగవంతుని గురించి మరియు ఆయన లీలావిషేసాల గురించి వింటూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం. 
2. కీర్తనము : chanting his name and reciting hymns in his praise కీర్తనం అంటే భగవంతుని గురించి ఆయన తత్త్వం గురించి కీర్తించడం అంటే ఆయనే ఈ సమస్త లోకాలకు పాలకుడు అని ఆయన నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం.
౩. స్మరణము : remembering him స్మరించడం అంటే ఆ దేవదేవుడిని నిరంతరం మన మనస్సులో స్మరిస్తూ సంపూర్ణంగా అధ్యత్మికతో జీవించడం.
4. పాదసేవనము : serving his lotus feet పాదసేవనం అంటే ఆ భగవంతునికి నిర్మలమైన మనస్సుతో నువ్వు సమర్పించే ప్రతిది ఆయన పాదాలకు సమర్పించడం.
5. అర్చనము : worshipping him అర్చనము అంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పిస్తూ ఉండడమే. దీనినే భగవంతునికి అర్చన చేయడం అంటారు.
6. నమస్కారము : praying obeisance to him నమస్కారము అంటే భగవంతునిని సంపూర్ణంగా మనస్పూర్తిగా నమస్కరించడం. ఆయనను మనసార ప్రార్ధించడం. 
7. దాస్యము : practicing the role of his servant దాస్యము అంటే భగవంతుడు ఒక అధికారిగా నువ్వు ఆయన సేవకుడిని అని భావిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికంతో గడపడం.  
8. సఖ్యత్వము : looking upon him as an intimate friend సఖ్యత్వము అంటే ఆయన నీకు ఒక మిత్రుడుగా భావిస్తూ నీకు మరియు ఆయనకు ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకొని జీవించడం.   
9. ఆత్మ- నివేదనము : surrending oneself totally to him ఆత్మ నివేదనము అంటే సంపూర్ణ శరణాగతి అంటే సమస్తము నువ్వే నాది అంటూ ఏది లేదు అని జరిగే ప్రతిది నీ మూలంగానే జరుగుతుందని, నీకు నువ్వు సంపూర్ణంగా శరణాగతి కావడమే.
ఈ విధంగా మనం సాయిబాబా చెప్పిన నవవిధ భక్తి మార్గాలను  తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల మనలను ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు.


No comments:

Post a Comment