My Blog List

My Blog List

Thursday, March 6, 2014

భగమన్నామస్మరణ :



మారణాయుధం ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి తగ్గుతుంది. అందువల్ల త్వరగా నాశనమవుతాడు. కానీ దైవశక్తి (మంత్ర శక్తి) ఉపయోగించిన కొద్దీ ఉపయోగించే వాడి శక్తి పెరుగుతూనే ఉంటుంది. అందువలన చెడు నశిస్తుంది. ఇతని శక్తి రెట్టింపవుతుంది. మొదటిది హింస, రెండోది అహింస. ఆధ్యాత్మికత వలన సమాజము, వ్యక్తి కూడా ఉద్ధరింపబడతారు. సాధన వలన సాధ్యంకానిది లేదు. ఎటువంటి సాధనలు (పనిముట్లు) అవసరం లేకుండానే ఎంతో ఎత్తుకు ఎదగడమే ఆధ్యాత్మికత రహస్యం. శ్రద్ధతో చేసే సాధన వలన మాత్రమే విజయాన్ని పొందగలము.
సాధన : భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని చేసే ప్రయత్నాన్నే సాధన అంటాము. అనగా సంస్కారాల మార్పుకు చేసే తీవ్రమైన ప్రయత్నము భగవంతునికి దగ్గర చేస్తుంది. మానవజన్మ సర్వశ్రేష్ఠమైన సంపద. భగవంతుడిచ్చిన అమూల్యమైన కానుక. మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది, అమూల్యమైనది.
ప్రాణము కొనలేనిది, కొలువలేనిది. కర్మతో జన్మ ఎత్తివచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము. పాప, పుణ్యములే సుఖ, దు:ఖములకు మూలము. తెలుసుకుని చేస్తే సాధన. లేదంటే యాతన.కులము అనగా సమూహము. సామూహిక ప్రయత్నం ప్రధానంగా సాధన చేయడం ఆనందదాయకం. అంత:కరణాన్ని శుద్ధం చేసేది సత్సంగమే. ఒంటరిగా కూడా సాధన చేయడం మంచిది. కర్మలలో శ్రేష్ఠమైనది భగవత్కార్యము.
మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది. అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది. కొలువలేనిది. కర్మతో జన్మనెత్తి వచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము.
భగవత్కార్యము : కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున నామముల వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది భగవన్నామస్మరణ. దైవం నామాన్ని పదే పదే ఉచ్ఛరించడాన్ని నామ జపము అంటారు.
అసలు ఏ నామాన్ని జపించాలి? భగవంతుడి రూపము ఏది? భగవంతుని నామము ఏది? ఇంతమంది దేవుళ్లలో ఎవరికి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇంతమందికీ చేయకపోతే ఏమౌతుందో, ఎవరేమనుకుంటారో యిన్ని సందిగ్ధాలతో అయోమయంలో పడిపోయి ఇటూ అటూ పరిగెడుతూ, కాలాన్ని వ్యర్థం చేయనవసరం లేదు. తెలుసుకుంటూ చేసేది సాధన. ప్రయత్నము. మన కోసం మనం చేసేదే రుూ కార్యసాధన. నిశ్చయంగా సత్యస్వరూపుడు, పరమాత్ముడు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు. సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలనెడి ఐదు విధములుగా వేంచేసియున్నాడు.
వైష్ణవ అవతారతత్త్వము :
1.
పరస్వరూపము : శుద్ధ సత్త్వమయమగుటచే కోటి సూర్య ప్రకాశమానమై, వైకుంఠ లోకాలను కల్పవృక్షం కింద రత్న ఖచిత సింహాసనంపై శ్రీ, భూ, నీలా సమేతుడై, నిత్య ముక్తానుభావ్యుడై, నిరతిశయానంద యుక్తుడై వేంచేసియుండు స్వామి -పరస్వరూపము.
2.
వ్యూహ స్వరూపము : క్షీరసాగరాన, జగత్సృష్టికి మూలకందమై, జ్ఞానశక్తి, బలైశ్వర్య వీర్య తేజస్సులతో కూడుకొనియుండు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవాది నామాలచే వ్యవహరించబడే భగవత్స్వరూపం -వ్యూహ స్వరూపము.
3.
విభవ స్వరూపం : దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ధర్మసంస్థాపన అప్రాకృత దివ్యమంగళ స్వరూపం తోడనే, ఈ లీలా విభూతికి విచ్చేసి, సకల మనుజనయన విషయాలై యుండు శ్రీరామ కృష్ణాద్యవతారాలు -విభవ స్వరూపం.
4.
అంతర్యామి స్వరూపం : నిఖిల ప్రవృత్తి కారకుడై సకల జీవాత్మలయందును పరమాత్మయై అంతర్యామిగా వేంచేసియుండి, సత్కర్మానుష్ఠానాన్ని అనుమతించు స్వరూపమే -అంతర్యామి స్వరూపం.
5.
అర్చావతారం : భగవచ్ఛాస్త్రోక్త ప్రకారం శ్రీమూర్తులగల్పించి, యధాశాస్త్రంగా ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో వానిని ఆరాధించే భక్తాగ్రేసరులచే పూజింపబడే భగవానుని దివ్యమంగళ విగ్రహం -అర్చావతారం.

No comments:

Post a Comment